S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/30/2018 - 04:59

పెద్దపల్లి రూరల్, మార్చి 29: హైకోర్టు ద్వారా స్టే ఆర్డర్ జారీ అయినట్టు నకిలీ స్టే ఆర్డర్ సృష్టించిన కేసులో ఒక న్యాయ వాదితో పాటు మరో ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు 2500 రూపాయల జరిమానా విధిస్తు పెద్దపల్లి సబ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి రాజేందర్ గురువారం తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/30/2018 - 04:21

మైలవరం, మార్చి 29: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం గడిపిన అంతరాష్ట్ర దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నవైనమిది. సుమారు నాలుగేళ్ళ క్రితం జరిగిన దొంగతనం కేసులో ఆధారాలు లభించక మూసివేసిన కేసును సైతం తిరగదోడి దొంగను పట్టుకుని అప్పట్లో చోరీ చేసిన సొత్తును రికవరీ చేసిన మైలవరం పోలీసులకు జిల్లా పోలీసులతోపాటు ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.

03/30/2018 - 04:19

విజయవాడ క్రై, మార్చి 29: నగరంలోని ఏలూరు రోడ్డు సోనోవిజన్ షోరూంలో చోరీ జరిగింది. సినీ ఫక్కీలో దుండగులు షోరూంలోకి చొరబడి బంగారు నాణేలు, నగదు అపహరించుకుపోయారు. ఈ ఘటన వాణిజ్య వర్గాల్లో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. యథావిధిగా షోరూం సిబ్బంది బుధవారం రాత్రి 10.30 గంటలకు షట్టర్లు దించేసి తాళాలు వేసుకుని ఇళ్లకు వెళ్లారు. రోజువారీగా గురువారం ఉదయం వచ్చిన సిబ్బంది తాళాలు తెరిచి లోపలికి వెళ్లారు.

03/30/2018 - 02:49

వరంగల్, మార్చి 29: వరంగల్ అర్బన్ జిల్లా చింతల్ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద రైలు కింద పడి నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం జరిగింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉండగా, అదే ప్రాంతంలో మరో కుటుంబానికి చెందిన వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

03/30/2018 - 02:47

ఉట్నూరు,మార్చి 29: అడవి పందిని ఢీకొని జీపు బోల్తాపడిన ప్రమా దంలో ముగ్గురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని పులిమడుగు సమీపంలో గురువారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది.

03/30/2018 - 02:25

అనంతపురం, మార్చి 29: అనంతపురం జిల్లా కలెక్టర్ జీ.వీరపాండ్యన్‌కు రెండు నెలల జైలుశిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు గురువారం తీర్చు చెప్పింది. వీరపాండ్యన్ గతంలో విజయవాడ కమిషనర్‌గా పనిచేసినపుడు పుష్కరఘాట్ నిర్మాణ సమయంలో ఆక్రమణలను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఆ సందర్భంగా ఇద్దరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల ఫిర్యాదు మేరకు ఆక్రమణల తొలగింపును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

03/30/2018 - 02:14

పామిడి, మార్చి 29 : పట్టణ పరిధిలోని పొగురూరు-నీలూరు గ్రామాల మధ్య జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతపురం వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనం ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న గోరంట్ల మండలం కమ్మవారిపల్లికి చెందిన కాలవ హరీష్ (28) మృతి చెందాడు.

03/30/2018 - 02:14

గోరంట్ల, మార్చి 29 : మండల పరిధిలోని పులగూర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. పులగూర్లపల్లికి చెందిన హుసేనమ్మ (68) జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తుంన్న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిందన్నారు. వెంటనే హైవే అంబులెన్స్‌లో కర్నాటక బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు.

03/30/2018 - 00:49

విశాఖపట్నం, మార్చి 29: తప్పుడు డాక్యుమెంట్లపై రియల్‌ఎస్టేట్ వ్యాపారులకు, బిల్డర్లకు ఉద్దేశపూర్వకంగా అడ్డదారిలో రుణం మంజూరు చేసిన బ్యాంక్ మేనేజర్‌తోపాటు, తొమ్మిది మందికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ విశాఖ సీబీఐ కోర్టు న్యాయమూర్తి గాయత్రిదేవి గురువారం తీర్పు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/30/2018 - 00:43

చర్ల, మార్చి 29: తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు మరోసారి అలజడి సృష్టించారు. పోలీసు ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో ఇద్దరిని దారుణంగా హతమార్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామానికి చెందిన ఇర్పా లక్ష్మణ్(28) అలియాస్ భరత్ మావోయిస్టు పార్టీలో దళ సభ్యుడిగా పని చేసి లొంగిపోయాడు.

Pages