రాష్ట్రీయం

మంత్రులు ఫోన్లు ఎత్తడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో జీరో అవర్
హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్ర మంత్రుల్లో చాలా మంది ఏదైనా పని ఉండి ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని బిజెపి శాసనసభాపక్ష నేత పి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.
శాసనసభలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ కొంత మంది ఫోన్లు ఎత్తి వెంటనే బదులిస్తున్నారని ఆయన అన్నారు. ఒక వేళ మీటింగ్‌లో ఉంటే ఆ తర్వాత ఫోను చేయవచ్చని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ మంత్రులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, మీటింగ్‌లో ఉంటే మాట్లాడలేరని, ఆ తర్వాత బదులిస్తున్నామని చెప్పారు. అనంతరం బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్ ఆగడాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనేక మంది చిరు వ్యాపారులు వీరి ఆగడాలకు బలవుతున్నారన్నారు. విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు.
టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్ర రాజధాని అమరావతి, విజయవాడ నగరాల పేర్లకు అప్రతిష్టతెచ్చే విధంగా ప్రతిపక్ష పార్టీ వైకాపా వ్యవహరశైలి ఉందని విమర్శించారు.
ఈ విషయమై రాష్ట్ర మంత్రి ఒకరు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్నారు. విభజన వల్ల నష్టపోయి, నవ్యాంధ్రగా అవతరించి అభివృద్ధిలో దూసుకుపోతుంటే, ఒకటి రెండు సంఘటనలు జరిగితే విస్తృతప్రచారం చేస్తున్నారన్నారు. అమరావతిపై వైకాపా విషప్రచారం చేస్తోందన్నారు.
టిడిపి ఎమ్మెల్యే కె శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంలో విశాఖ స్టీలు ఫ్యాక్టరీ ఉక్కును వాడాలని కోరారు. మీసాల గీత మాట్లాడుతూ విజయనగరం తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ విజయవాడ, మచిలీపట్నం రోడ్డును తక్షణమే వెడల్పు చేయాలని కోరారు.