రాష్ట్రీయం

వైకాపా నిరసనలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ ఎమ్మెల్యేలతోపాటు ముఖ్యనేతలు అరెస్టు

విశాఖపట్నం, డిసెంబర్ 3: నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా వైకాపా గురువారం విశాఖలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. వివిధ ప్రాంతాల నుంచి నగరంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్ వద్ద ధర్నాకు బయలుదేరుతుండగా, ర్యాలీకి అనుమతి లేదంటూ పొలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది.
శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్టులు చేయటం అన్యాయమంటూ వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు మాజీ ఎమ్యెల్యేలు కూడా పోలీసుల తీరుపై మండిపడ్డారు. అయితే ర్యాలీకి అనుమతి లేనందునే అరెస్టు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరగటంతో దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసిన పోలీసులు నగర పరిధిలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. 100 మందికి పైగా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా ఆందోళనకు దిగితే అక్రమంగా అరెస్టులు చేయడం అమానుషమంగా మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఇలాఉంటే మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో లేని నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.
(చిత్రం) గురువారం విశాఖపట్నంలో ధర్నా చేసేందుకు సిద్ధమైన వైకాపా నేతలను అరెస్టు చేసి జీపులో తరలిస్తున్న పోలీసులు