రాష్ట్రీయం

యాగానికి సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంకుర్పారణ పూజలు నిర్వహించిన కెసిఆర్
రేపటినుంచే అయుత చండీయాగం ప్రారంభం
ఎర్రవెల్లిలోని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు
యాగ స్థలం వద్ద ఏర్పాట్ల పరిశీలన
2వేల మంది మహిళల కుంకుమార్చనకు ఏర్పాట్లు
ప్రముఖుల విశ్రాంతి కోసం ప్రత్యేక కాటేజీలు

హైదరాబాద్, డిసెంబర్ 21: అయుత చండీయాగానికి సిఎం కె చంద్రశేఖర్‌రావు దంపతులు సోమవారం ఉదయం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సంకల్పం తీసుకుని ప్రారంభ పూజలు నిర్వహించారు. రుత్విజులు నిర్ణయించిన ముహుర్తం మేరకు ఉదయం 10.55 గంటలకు సహస్ర మోదకాలతో గణపతి పూజ, గురుపూజ నిర్వహించి అంకుర్పారణ చేశారు. ‘తదేవ చంద్రబలం, తదేవ తారబలం... శుక్లాంభరధరం విష్ణుం... సర్వేభ్యో, బ్రాహ్మణేభ్యో... సుముహుర్తం’ అంటూ సహస్ర నామ పఠనంతో పూజలు ప్రారంభమయ్యాయి. రుత్విజులు ముఖ్యమంత్రి దంపతులతో సంకల్పం చెప్పించారు. ఈ సందర్భంగా గురు ప్రార్థన, పుణ్యాహవచనం, దేవనాంది, అంకుర్పారణ, పంచగవ్యమేళనం, ప్రాశనం, గోపూజ, యాగశాల ప్రవేశం, యాగశాల సంస్కారం, అఖండ దీపారాధన, మహా మంగళ హారతి, ప్రార్థనలతో పూజలు ప్రారంభమయ్యాయి. యాగస్థలికి వచ్చే ముందు సిఎం దంపతులు ముందుగా ఎర్రవెల్లిలోని పోచమ్మ, ఎల్లమ్మగుడిలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. యాగం విజయవంతం కావాలని వేద పండితులు, గ్రామస్తులు సిఎంను ఆశీర్వదించారు.
ఏర్పాట్లను పరిశీలించిన సిఎం కెసిఆర్
అయుత మహాచండీయాగానికి వచ్చే భక్తులు, బ్రాహ్మణులు, మహిళలు, ప్రముఖులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పురోహితులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చేసిన ఏర్పాట్లను సిఎం పరిశీలించారు. యాగం కోసం చేసిన ఏర్పాట్లను మూడు గంటలపాటు సిఎం కాలినడకన తిరుగుతూ స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. యాగాన్ని వీక్షించడానికి వచ్చే భక్తులను వివిధ కేటగిరీలుగా విభజించి వారికి కల్పించాల్సిన వసతి, భోజనం, విశ్రాంతి, వీక్షణం ఏర్పాట్లను సిఎం సమీక్షించారు. యాగ ప్రాంగణంలో రెండువేల మంది మహిళలు ఒకేసారి కుంకుమార్చన చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని, అర్చన సామాగ్రిని కూడా ఉచితంగా అందించాలని సిఎం సూచించారు. కుంకుమార్చన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు మహిళా బ్రాహ్మణ వలంటీర్లను నియమించాలని నిర్ణయించారు. యాగశాలకు ఎదురుగా ప్రవచనాలు, ఆధ్యాత్మిక పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అనుగ్రహ భాషణం కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. యాగం జరిగే రోజుల్లో ఉదయం నుంచి రాత్రివరకు భక్తులకు భక్తిరస పరవశాన్ని కలుగచేసేందుకు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు సిఎం చెప్పారు. భక్తులు నేరుగా యాగశాలకు వెళ్లి ప్రదక్షిణలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. యాగాన్ని తిలకించడానికి ఇరువైపుల 4 వేలమంది ఒకేసారి కూర్చోవడానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శృంగేరి పీఠం నుంచి వచ్చే రుత్విజులు కోసం, అలాగే తెలంగాణ నుంచి వచ్చే బ్రాహ్మణులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాటేజీలను సిఎం పరిశీలించారు. కాటేజీలలో ఎసి, ఫ్రిజ్, టాయిలెట్లు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు. భక్తులకు సమాచారం అందించడానికి ఏర్పాటు చేసిన సమాచార కేంద్రం, వైద్య కేంద్రం, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్లతోపాటు రెస్క్యూ టీమ్ బృందాలను పరిశీలించారు. పార్కింగ్ స్థలాన్ని, భోజనశాలను సందర్శించి తీసుకోవాల్సిన చర్యలపై వలంటీర్లను సూచనలు చేశారు.
(చిత్రం) అయుత చండీయాగం అంకురార్పణ పూజలు నిర్వహిస్తున్న సిఎం కెసిఆర్ దంపతులు