రాష్ట్రీయం

యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిడిపి నేత మోత్కుపల్లి విజ్ఞప్తి 26న విద్యాసంస్థల బంద్
27న అఖిలపక్షం ఆధ్వర్యంలో పాదయాత్ర, డిసెంబర్ 1న ఉపవాస దీక్ష

యాదగిరిగుట్ట , నవంబర్ 22: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని యాదాద్రి రాజగోపురం ముందు మోకాళ్లపై నిలుచుని ముఖ్యమంత్రి మదిలో యాదాద్రి జిల్లా కేంద్రంగా ప్రకటింప జేయాలని యాదాద్రి లక్ష్మీనరసింహ్మస్వామిని వేడుకుంటున్నానని టిడిపి కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా యాదాద్రి రాజగోపురం ముందు విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వాంగ సుందరంగా యాదాద్రిని తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరారు. సిద్దిపేటలో కలుపవద్దని నల్లగొండ, వరంగల్, మెదక్, హైద్రాబాద్‌కు నడిబొడ్డున ఉన్న యాదాద్రి భౌగోళికంగా, వనరుల పరంగా మంచి ప్రాంతమని జిల్లా కేంద్రంగా ఏర్పడితే మంచి కళాశాలలు, యునివర్శిటీలు, హెడ్‌క్వాటర్సు, రవాణా సౌలభ్యం కలుగుతుందని ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్థాయని అన్నారు. యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించక పోతే పార్టీలకతీతంగా, జెండాలను పక్కన పెట్టి ప్రత్యక్షంగా పోరాటం చేస్తామన్నారు. త్వరలో సాగు జలాలపై పోరాటం జరుపుతామని అన్నారు. తదనంతరం యాదాద్రిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఈ నెల 26న నియోజకవర్గ కళాశాలలు, పాఠశాలలకు బంద్ పిలుపు నిస్తున్నామని విద్యార్థులచే పోరాటం చేస్తామన్నారు. 27న ఆలేరు నుండి యాదగిరిగుట్ట వరకు మహా పాదయాత్ర అఖిలఫక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, డిసెంబర్ 1న యాదగిరిగుట్టలో ఒకరోజు నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు స్థల పరిశీలన చేశారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి, టిడిపి జిల్లా కార్యదర్శి పలెపాటి బాలయ్య, మాజీ ఎంపిపి దడిగె ఇస్తారి, టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆకుల రాజు, పవన్‌కుమార్, చంద్రగిరి శ్రీనివాస్, బిట్టు కిశోర్, ముకుందరెడ్డి పాల్గొన్నారు.