వీక్లీ సీరియల్

పాతాళస్వర్గం-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజు సాయంత్రం ఆరు దాటుతుండగా ఇంట్లోకొచ్చిన గౌతమి, హాల్లో కూర్చుని తండ్రితో మాట్లాడుతున్న అనిల్‌ని చూసి క్షణం కంగారు పడిపోయింది.
‘అదిగో అమ్మాయొచ్చేసింది అనిల్. నువ్వు గమనించావో లేదో గానీ ఇప్పుడు గౌతమి ఎంతో ఉత్సాహంగా ఉంటోంది. నాకూ మనశ్శాంతిగా ఉంది. ఇదంతా నీ చలవే’ అన్నాడు శంకరయ్య కూతురికేసి ప్రేమగా చూస్తూ.
తేరుకున్న గౌతమి-
‘హాయ్ అనిల్! ఎప్పుడొచ్చావ్?’ అంది బలవంతంగా నవ్వుతూ. ఆమెకేసి పరిశీలనగా చూస్తూ-
‘జస్ట్ గంటయింది’ అన్నాడు.
‘సారీ అనిల్! నువ్వొస్తావని తెలియదు’ అందామె మెల్లగా.
‘ఎక్కణ్ణించి వస్తున్నావ్?’ అని అతనడగలేదు. ఫలానా చోట్నించీ వస్తున్నానని ఆమె చెప్పనూ లేదు. ‘వుండు కాఫీ తెస్తాను’ అంటున్న ఆమెనాపేశాడతను.
‘ఎలా తెలుస్తుంది? నువ్వు ఫోన్‌లో కూడా దొరకడం లేదు. ఇన్నాళ్లూ ఏమైపోయావ్?’ అన్నాడతను నిష్ఠూరంగా.
‘సారీ చెప్పానుగా అనిల్. ఇక వదిలెయ్’ అందామె తల దించుకుని.
ఆమె మొహంలోకి పరిశీలనగా చూసిన అనిల్ ఆమె తన దగ్గర ఏదో దాస్తోందని అర్థమై పోయిందతనికి.
‘గౌతమీ! నేన్నీకు పరాయివాడిలా కనిపిస్తున్నానా?’ అన్నాడు గంభీరంగా. ఆమె కంగారు పడిపోయింది.
‘అసలేమైంది నీకు? జరిగిన విషయం ఏదైనా నాకు చెప్పందే తోచేది కాదు నీకు. అలాంటిది నన్ను తప్పించుకు తిరుగుతున్నావ్. క్లినిక్‌కి రాకపోగా ఫోన్‌లో కూడా దొరకడం లేదు. ప్రాణంలో ప్రాణంగా ఉండే నన్ను పూర్తిగా మర్చిపోయావ్. నాతో కలిసి నవ్వుతూ తుళ్లుతూ కబుర్లు చెప్తూ పని చేసే నువ్వు, నేననే వాణ్నొకణ్ని వున్నానన్న సంగతే మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నావ్. చంద్రయ్య మీద హత్యా ప్రయత్నం జరిగిందన్న సంగతి ఇప్పుడు అంకుల్ చెప్తేగానీ తెలియలేదు. నీలో నువ్వే బాధపడకపోతే, నీ కష్టసుఖాల్లో పాలుపంచుకునే నేనున్నానన్న సంగతే మర్చిపోయావ్’ ఆవేదన, అనునయం నిండిన గొంతుతో అన్నాడు అనిల్. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. శంకరయ్య మాత్రం విస్తుపోయాడు.
‘గౌతమీ! నువ్వు క్లినిక్‌కి వెళ్లడం లేదూ?’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘లేదు’ అన్నట్టు అడ్డంగా తలూపింది గౌతమి.
‘మరైతే రోజూ ఎక్కడికెళ్తున్నావ్?’
ఆమె మాట్లాడలేదు. కానీ కళ్లల్లో విపరీతమైన బాధ చోటు చేసుకుంది. శంకరయ్యకి చిరాకొచ్చేసింది.
‘ఏంటమ్మా! చిన్నపిల్లల చేష్టలు? ఇద్దరూ డాక్టర్లు. కాబోయే భార్యానర్తలు. ఇద్దరూ కలిసి క్లినిక్ చూసుకుంటే అతనికి కాస్త శ్రమ తప్పుతుంది కదా అని నేను ఆశ పడుతుంటే, అతనికి సాయపడ్డం మానేసి నీకు పట్టనట్టు తిరుగుతున్నావా?’ అన్నాడు సున్నితంగా మందలిస్తూ.
‘అతని పనులకేం ఆటంకం లేదు నాన్నా! లూసీ అనే ఓ మంచి నర్సుని పంపించాను’ అంది గౌతమి.
‘లూసీ.. లూసీ ఎవరు?’
‘అదే.. కేరళ నించి వచ్చిన ఓ అనాధ. కాళ్లు పట్టుకుని బతిమాలితే, ఆమె డిగ్రీ అదీ చూసి మరీ పంపాను. అదీ అనిల్‌ని అడిగి, అతను సరే అంటేనే పంపాను. ఏం అనిల్? నువ్వు పంపమంటేనే కదా నేనామెని పంపింది?’ అంది గౌతమి అనిల్‌కేసి చూస్తూ.
‘అదెప్పటి మాట? అయినా తను కేవలం పని కోసం వచ్చిన ఓ నర్స్. తన పని చేసుకుపోతుంది. ఆ వంకన నీ ఆరోప్రాణం అయిన నానించి తప్పుకుని తిరుగుతావా?’ అన్నాడు అనిల్ గంభీరంగా.
‘అది కాదు అనిల్! ఆ దోపిడీని గురించి తల్చుకుంటేనే మనసంతా దిగులుగా అయిపోతోంది. అన్నింటికన్నా బాధించే విషయం ఏవిటంటే ఆ ప్రయాగ గారూ వాళ్లందరికీ మా మీదే అనుమానం’ గౌతమి గొంతు వణికింది. ఆమె మొహంలోని ఆవేదన చూసి కదిలిపోయాడు అనిల్. ఆమె ఏదో అనబోతూంటే-
‘ఇంక ఈ మాటలకేం గానీ కాస్సేపలా గుడి వెనక చెట్ల కింద కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుందాం పద’ అంటూ ఆమె చెయ్యి పట్టుకుని, శంకరయ్యకి చెప్పి ఉత్సాహంగా బైటికెళ్లాడు.
శంకరయ్య తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు.
‘పాపం అనిల్! గౌతమిని గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో’ అనుకుని మురిసిపోయాడు.
గంట తర్వాత ఉత్సాహంగా వచ్చారు అనిల్, గౌతమి.
అనిల్ శంకరయ్య దగ్గర సెలవు తీసుకుని మరిన్ని అనునయ వాక్యాలు పలికి వెళ్లిపోయాడు.
‘ఇంక క్లినిక్‌కి వెళ్లడం మానకు’ నవ్వుతూ అన్న తండ్రి మాటలకి సిగ్గుగా తలూపింది గౌతమి.
* * *
రోజులు గడిచిపోతున్నాయి. దొంగల జాడ తెలియలేదు సరికదా, కొండ పరిసరాల్లో ఉన్న చిన్నచిన్న ఆలయాల్లో సైతం నగలు, వస్తువులు మాయమై ప్రభుత్వానే్న గడగడ లాడిస్తున్నారా దొంగలు. చంద్రయ్య ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునో ఏమో గుట్ట మీద ఓ కానిస్టేబుల్‌ని సెక్యూరిటీగా నియమించారు ప్రయాగ, ప్రభు. గర్భగుళ్లో రహస్య స్థావరంలో దాచిన నగల్ని అక్కడ్నించి మార్చాక శంకరయ్య, గౌతమీ కూడా నిశ్చింతగానే ఉన్నారు. కానీ ప్రయాగ వాళ్లకి తమమీదున్న అనుమానం పోలేదనుకున్నప్పుడల్లా వాళ్ల మనసులు చివుక్కుమంటున్నాయి. తండ్రి ఆరోగ్యం కాస్తా దిగజారడంతో అనిల్ దగ్గరికి అంతగా వెళ్లడం లేదు గౌతమి. అతనే తరచూ వచ్చి వెళ్తున్నాడు. అతని మాటలు వాళ్లకెంతో సేద తీర్చినట్టుండేది. అందుకే అతనితో తెగ కబుర్లు చెప్పేవారు. ముఖ్యంగా గౌతమి!
కాస్త ప్రశాంతత చిక్కుతున్న సమయంలో ధర్మారావు ఫోన్ చేసి పిడుగులాంటి వార్త చెప్పాడు.
నడిరోడ్డు మీద చంద్రయ్యని ఓ ఆటవికుడు దారుణంగా కాల్చి పారిపోయాడు. ఆ కాల్చినవాడు మునుపు అతన్ని కాల్చినవాడే అని ప్రయాగ నమ్మకం. అందుకే నెత్తురుమడుగులో కొనవూపిరితో వున్న అతన్ని హాస్పిటల్‌కి తరలించి, అతనివల్ల వివరాలేమైనా తెలుస్తాయేమో అన్న ఆశతో ప్రయాగ, ప్రభు కూడా అక్కడే వున్నారు. ఈ వార్త విని వణికిపోయారు తండ్రీ కూతుళ్లు.
‘నాన్నా! మనం పొరపాటు చేశాం. ఆ పొరపాటు దిద్దుకోకపోతే మనం మరింత పాతాళంలో కెళ్లిపోతాం. అందుకే నగల గురించి ప్రయాగ గారికి చెప్పేద్దాం. ఆ నగలన్నీ ఆయనకి హేండోవర్ చేసి, చేసిందానికి క్షమాపణ చెప్పుకుందాం’ అంది గౌతమి.
‘ఇలా నిత్యం చస్తూ బతికేకన్నా నగల గురించి సి.ఎం. గారికి చెప్పి ఆయనే శిక్ష వేస్తే అది అనుభవిద్దాం’ అన్నాడు శంకరయ్య.
‘అనిల్ వస్తే ధైర్యంగా ఉంటుంది’ అంటూ అతనికి ఫోన్ చేసింది గౌతమి. కానీ ఫోన్ స్విచాఫ్ చేసుంది. నిరాశగా ఫోన్ పెట్టేసింది గౌతమి.
‘ఏమ్మా! అనిల్‌తో మాట్లాడావా? వస్తానన్నాడా?’ ఆతృతగా అడిగాడు శంకరయ్య.
‘లేదు నాన్నా! స్విచాఫ్‌లో ఉంది’ అంది గౌతమి. శంకరయ్య మొహం పాలిపోయింది.
‘మనం నగలు దాచిన సంగతి తల్చుకుంటే...’
‘నాన్నా! ప్రస్తుతానికి ఆ నగల గురించి మర్చిపోయి హాయిగా కాసేపు నిద్రపో’ తండ్రి మాట పూర్తి కాకుండానే అంది గౌతమి.
‘మీరు మర్చిపోయినా మేం మర్చిపోం డాక్టర్!’ ఖంగుమంది ప్రయాగ గొంతు. హఠాత్తుగా అతన్ని చూసిన తండ్రీ కూతుళ్లు బిగుసుకుపోయారు. కొన్ని క్షణాలకి తేరుకుని-
‘రండి రండి. ఏవిటి సార్ ఇంత ప్రొద్దునే్న వచ్చారు?’ అంటూ ఆప్యాయంగా ఆహ్వానించారు.
‘బావున్నారా?’ నవ్వుతూ అన్నాడు ప్రయాగ. ఆ నవ్వులో హేళన ఉంది. అది గమనించిన గౌతమి మొహం గంభీరంగా అయిపోయింది.
‘చంద్రయ్య ఎలా ఉన్నాడు సర్?’ ఆతృతగా అడిగాడు శంకరయ్య. ప్రయాగ లోపలికొస్తూ-
‘ఇంకా పోలేదు’ అన్నాడు కఠినంగా.
అతను తమ నించి ఏదో రాబట్టాలని అర్థమయిందా తండ్రీ కూతుళ్లకి. ఇక ఆలోచించదల్చుకోలేదు.
‘ప్రయాగగారూ! మేం జరిగిందంతా చెప్పేస్తాం’ అంది గౌతమి మెల్లగా.
‘చెప్పింది చాలు. ముందా నగలు ఎక్కడ దాచారో చెప్పండి చాలు’ గంభీరంగా అన్నాడు ప్రయాగ.
‘అది కాదు ఎస్.పి.గారూ! మేం కొన్ని పొరపాట్లు చేశాం. ముఖ్యంగా నేను. నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నాను. కానీ అది నా స్వార్థంతో చేసినవి కాదు. అసలేం జరిగిందంటే...
‘అన్నీ మాకు తెలుసు. మీ కాకమ్మ కథలు వినడానికి మేం రాలేదు. ఉదయం మీ తండ్రీ కూతుళ్లు నగల గురించి మాట్లాడుకున్న మాటలన్నీ మా కానిస్టేబుల్ రికార్డ్ చేశాడు. నా అనుమానమే నిజమైంది. అందుకే అఫిషియల్‌గా అరెస్ట్ వారెంట్‌తో వచ్చాను. ముందా నగల గురించి చెప్పండి’ అన్నాడు ప్రయాగ కఠినంగా.
కుప్పకూలిపోయాడు శంకరయ్య. కానిస్టేబుల్‌ని పెట్టింది తమ సెక్యూరిటీ కోసం కాదనీ, తమ మీద నిఘా వెయ్యడానికే అనీ అర్థమై పోయిందా తండ్రీ కూతుళ్లకి.
‘నేనొకసారి మా లాయర్‌తో మాట్లాడుతాను’ కాస్సేపటి తర్వాత తేరుకున్న గౌతమి వేడికోలుగా అంది.
‘ఇంక ముందు మీరు మాట్లాడేది లాయర్లతోనే. ఇప్పటికి పదండి’ అన్నాడు ప్రయాగ. శంకరయ్యకి దుఃఖం వచ్చేసింది.
‘సరే! నన్ను అరెస్ట్ చెయ్యండి. ఏదైనా నేరం చేస్తే అది నేనే చేశాను. ఇందులో మా అమ్మాయికెలాంటి సంబంధం లేదు. పెళ్లి కావలసిన పిల్ల. డాక్టర్. ఆమెని ఈ ఊబిలోకి లాగకండి ప్లీజ్’ అన్నాడు గద్గద స్వరంతో.
‘అదీ! అలా దారికి రండి. నగలు మీ అధీనంలోనే వున్నాయిగా?’
‘ఊ..’
‘వాటిని తీసి రహస్య ప్రదేశంలో దాచినట్టు ఒప్పుకున్నట్టేగా?’
‘దాచిన మాట నిజమే. కానీ...’
‘ఇంకేం చెప్పొద్దు. ఆ నగలెక్కడ దాచారో చెప్పండి చాలు!’
‘కొండమీదే వున్నాయి’ నీరసంగా అన్నాడు శంకరయ్య.
‘గుడ్! నేనెంత మొత్తుకున్నా ఎవరూ నమ్మలేదు. పాపం! ఆ కాంతారావుగారూ, ధర్మారావుగారూ, మీక్కాబోయే అల్లుడూ కూడా మీరో దైవ సమానులనీ, దోపిడీ ఆ బ్లాక్‌టైగరే చేశాడనీ గొంతు చించుకుని మరీ చెప్పారు’ నవ్వాడు ప్రయాగ.
(ఇంకా ఉంది)

-రావినూతల సువర్నాకన్నన్