రాష్ట్రీయం

కలిసి పనిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 3: యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్‌కి చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం సాయంత్రం సిఎంఓలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో జల సంరక్షణ, నీటి యాజమాన్య పద్ధతులపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రివర్ వాటర్ బాడీ మేనేజ్‌మెంట్, మంచినీటి సరఫరా, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ రంగాల్లో పనిచేయటానికి ఆసక్తి ఉందని ప్రతినిధి బృందం నేత యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ (న్యూఢిల్లీ) డైరెక్టర్ పౌల్ వి.జెనె్సన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. తాము మిసిసిపి తీరంలో అమలుచేస్తున్న ప్రాజెక్టుల్లో టెక్నాలజీని ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. విదేశాల్లో వాటర్ కన్సర్వేషన్, ప్లడ్ కంట్రోల్ విధానాలపై అనుసరిస్తున్న అత్యున్నత సాంకేతిక పద్ధతులను చూపించారు. వాటర్ రీ సైక్లింగ్, డీసాలినేషన్ ద్వారా శుద్ధిచేసిన నీరు ఎలా ఉపయోగపడుతుందో చెప్పరు. యూరోపియన్ బృందంతో కలిసి పనిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ముందుగా ఏఏ రంగాల్లో పనిచేయాలో నిర్ణయించేందుకు లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ టాస్క్ఫోర్స్‌లో జలవనరులు, పంచాయతీరాజ్, అర్బన్ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాష్ట్రాల కంటే ముందుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారికి తెలిపారు. భూగర్భ జల మట్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేయటానికి తాము ఉపయోగిస్తున్న వాటర్ మీటర్లపై ముఖ్యమంత్రి వారికి వివరించారు. జవాబుదారీతనంతో, పారదర్శక విధానాలతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. పెన్షన్ల పంపిణీ, పౌర సరఫరాలశాఖ, విద్యుత్ శాఖ, వ్యవసాయ, జలవనరుల రంగాల్లో అమలుచేస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించారు. ఇదిలా ఉంటే విదేశీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విజన్‌ను ప్రశంసించారు. రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చక్కని ఆలోచన అని ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన పౌల్ వి.జెనె్సన్ ప్రశంసించారు. వ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధికి వాటర్‌గ్రిడ్ ఎంతో తోడ్పడుతుందన్నారు. నదుల అనుసంధానం ద్వారా, వాటర్ గ్రిడ్ ఏర్పాటు ద్వారా కరవురహిత ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోవటానికి ఆయన తపనను కొనియాడారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఓ జె.కృష్ణకిశోర్, ముఖ్యమంత్రి కార్యదర్శి జి.సాయిప్రసాద్, సిఎంఓ సహాయ కార్యదర్శి ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్నారు.