రాష్ట్రీయం

గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాగన్‌లో కాలిపోయిన బొగ్గు

రామగుండం, డిసెంబర్ 5: కరీంనగర్ జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లోని యార్డ్ ఏరియాలో బొగ్గు లోడ్‌తో నిలిచి ఉన్న గూడ్స్ రైళ్లో ఒక్కసారిగా తీవ్రస్థాయిలో మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి జరిగిన సంఘటనతో వ్యాగన్‌లోని బొగ్గు కాలిపోయింది. గోదావరిఖని సింగరేణి బొగ్గుగనికి చెందిన సిఎస్‌పి నుండి కర్నాటక రాష్ట్రంలోని రాయపూర్ కృష్ణా థర్మల్ స్టేషన్‌కు బొగ్గులోడ్‌తో గూడ్స్ రైలు బయల్దేరింది. దిగువ రైల్వే ట్రాక్‌లైన్లో బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ వ్యాగన్‌కు రూట్ క్లియర్ లేనందున ఆ రైలులో యార్డ్ ఏరియాలోనే నిలిపివేశారు. ఈ క్రమంలో రెండు వ్యాగన్ బోగీలోని బొగ్గు నుండి ముందుగా పొగలు చెలరేగాయి. ఇది కాస్తా రాత్రివరకు తీవ్రమై వ్యాగన్ బొగ్గు నుండి పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురయ్యారు. మంటలు విపరీతంగా వ్యాపించడంతో చూసిన రైల్వే సిబ్బంది రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వడంతో రామగుండం జెన్‌కో థర్మల్ స్టేషన్‌కు చెందిన ఫైరింజన్ సంఘటన స్థలికి చేరుకుని చెలరేగిన మంటలను ఆర్పివేశారు. వెంటనే గమనించడంతో భారీ మొత్తంలో బొగ్గు కాలిపోకుండా నివారించడంతో పాటు ప్రమాదం తప్పింది. (చిత్రం) వ్యాగన్‌లో తగలబడుతున్న బొగ్గు