రాష్ట్రీయం

పృథ్వీమాత రక్షణకు ఇదో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్ సమావేశం మార్గం చూపుతుంది విశ్వయోగి విశ్వంజీ

హైదరాబాద్, నవంబర్ 30 : ప్రృథ్వీమాత (్భగోళాన్ని) కాపాడుకునేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందని విశ్వయోగి విశ్వంజీ పిలుపు ఇచ్చారు. సోమవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరుగుతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఓపి) భూమాతను కాపాడుకునేందుకు వీలుగా మంచి నిర్ణయాలతో ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూమాతను కాలుష్యం నుండి కాపాడుకోవాలని తాను మొదటి నుండి చెబుతున్నానని గుర్తు చేశారు.
మనిషి మనుగడకు అవసరమైన పంచభూతాలను (నీరు, గాలి, భూమి, అగ్ని, ఆకాశం) విచ్చలవిడిగా కలుషితం చేస్తున్నామని పేర్కొన్నారు. పంచభూతాలు కలుషితం కావడం వల్ల వాతావరణంలో సమతుల్యత దెబ్బతింటోందని, దాని వల్ల ప్రకృతివైపరీత్యాలు వస్తున్నాయన్నారు. తరతరాల నుండి ప్రకృతిని భగవత్ స్వరూపంగా భావించి, కాపాడుతున్న సంస్కృతి భారతీయ సంస్కృతి అని గుర్తు చేశారు.
ప్రకృతిపట్ల మనిషికి గౌరవం ఉండాలని, ప్రకృతి మనిషి జీవనానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, మనుషులు మాత్రం పంచభూతాలను కలుషితం చేయడంతో వైపరీత్యాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. భూమాతను రక్షించుకునేందుకు అమెరికా, భారత్‌తో పాటు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు సమగ్ర ప్రణాళికలను రూపొందించుకుని అమలు చేయాలని గత పది, పనె్నండు సంవత్సరాల నుండి తాను ప్రయత్నిస్తున్నానని విశ్వంజీ గుర్తు చేశారు. భూమాతను కాపాడుకునేందుకు మంచి నిర్ణయాలతో ఈ సమావేశం ముందుకు వస్తుందని ప్రపంచమంతా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నదన్నారు. ప్యారిస్‌లో సిఓపి సమావేశాలు జరగడం ఆహ్వానించదగ్గ విషయమని, రుషులు, యోగుల సంకల్పం కూడా విశ్వాన్ని కాపాడాలన్నదేనని పేర్కొన్నారు.