Others

అంతే మరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషన్నాక కోపం సహజం. ఏదోక టైంలో ఎవరో ఒకరిమీద కోపం రావడం అనివార్యం. కోపం వచ్చినపుడు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. కోపానికి గురిచేసిన వ్యక్తిని చాచి లెంపకాయ కొట్టొచ్చు. అంత సీన్ లేదనుకుంటే -కోపానికి గురైన వ్యక్తి చేతిలోని వస్తువుని విసిరికొట్టొచ్చు. అదీ కాదనుకుంటే -ఏ బాత్రూంలోకో వెళ్లి కోపం తెప్పించిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మనసులోనే తిట్టుకుని బయటపడొచ్చు. ఇక్కడ అనుసరించే మార్గం ఏదైనా -కోపాన్ని బయటకు పంపడమే కర్తవ్యం. అచ్చంగా ఇలాంటి అలవాటే -చెన్నై బ్యూటీ సమంతాకూ ఉందట. సమంతాకూ కోపం వస్తే.. ‘ఎవరిమీదా అరవను. ఎవర్నీ తిట్టుకోను. చేతిలోని వస్తువుల్నీ విసిరికొట్టను. గబగబా జిమ్‌లోకి దూరిపోతాను. ఒళ్లంతా చెమట్లు పట్టేలా వర్కవుట్లు చేస్తాను. ఆ చెమట్లతోనే ఒంట్లోని కోపం కూడా ఆవిరైపోతుంది’ అంటోంది. మామూలుగానే ఫిట్‌నెస్ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించే సమంతా -కోపాన్ని కూడా అనుకూలంగా వర్కవుట్ చేసుకుంటుందన్న మాట. ఏమో నమ్మాలి మరి -ఈమధ్య జిమ్‌లో కసరత్తులతో ఫ్యాన్స్‌కు ఫొటోలు ట్వీట్ చేసింది. పైగా -జిమ్‌నే లవ్ చేస్తున్నట్టు ప్రకటించుకుంది కూడా.