Others

నిజం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెటర్ యువరాజ్ సింగ్ తన మధ్య ప్రేమాయణం నిజం కాదని కుండ బద్దలుకొట్టి చెబుతోంది ప్రీతిజింతా. అప్పట్లో బాలీవుడ్ భామగా, హీరోయిన్‌గా లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందని సంచలనం రేగింది. ఐపిఎల్ మ్యాచ్ ఆమె టీమ్‌ను కొనుగోలు చేసినప్పుడు యువరాజ్‌ను తన టీమ్‌లోకే తీసుకుందీ భామ. ఇటీవల ఈ విషయంపై మరోసారి దుమారం కూడా రేగింది. ఇద్దరు కలిసి పెళ్లిచేసుకోబోతున్నారన్న విషయం కూడా బైటికొచ్చింది. ఇప్పటికి గానీ ఆమెదాకా ఈ విషయం వినపడలేదట. అందుకే ఇప్పుడు వివరణ ఇచ్చింది. తన విషయాలు ప్రతి వారికి తెలియాలని ఎప్పుడూ అనుకోనని, తన పెళ్లి విషయం మాత్రం అందరికి చెబుతానని, అనవసరమైన ప్రేమాయణాలు నాకు అంటకట్టారని అంటోంది. యువరాజ్‌సింగ్, బ్రైట్లీలతో తనకు ముడులు పెట్టారని, వారు తనకు సోదరుల్లాంటివారని తాను వారింటికి వెళ్లి రాఖీలు కూడా కట్టివస్తానని చెబుతోంది.