Others
నేనెప్పుడూ స్ట్రాంగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
'చూడటానికి బక్కపలుచగా కనిపిస్తానని అనుకుంటున్నారేమో!. నేనెప్పుడు స్ట్రాంగే’ అంటోంది అందాల తార కాజల్. ఈ మధ్య ప్రతి విషయానికి తన స్పందన తెలియజేస్తోంది. గతంలో నాలుగైదు సార్లు అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పేది. ఇపుడలా కాదు. తాను చాలా ఫాస్ట్‌గా మారిపోయానంటోంది. చాలా తక్కువ సమయంలోనే టాప్‌స్టార్‌గా మారిన ఆమె తన అందాలను ప్రదర్శించటంపై ప్రస్తుతం దృష్టి పెట్టింది. గతంలో తాను పెట్టుకున్న హద్దులను చెరిపేసానని చెబుతోంది. ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్లిందంటే తాను జిమ్‌లో పెంచిన కండలను కూడా చూపించి మరీ చెప్పారు. తనకండ బలం చూపటం అంటే టీజ్ చేయడం కాదని స్ట్రాంగ్‌గా ఉండాలన్న సలహా అందులో అంతర్భాంగా ఉందని చెబుతోంది. ప్రస్తుతం టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు చిత్రాలతోపాటుగా తమిళంలో విజయ్, విక్రం చిత్రాలలో నటిస్తోంది. బాలీవుడ్లో కూడా ఆమె చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాను చేసిన పాత్రలే తనను స్ట్రాంగ్‌గా చేసాయంటోంది. మొత్తానికి తనపై తనకు పూర్తి నమ్మకం వచ్చిందని, తెలియనివాళ్లకు ఉచిత సలహాలు ఇస్తానంటోంది కాజల్.