Others

నాకు నచ్చిన పాట..... కారులో షికారుకెళ్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1950వ దశకంలో తెలుగు సినిమా పాటల చరిత్రలో అభ్యుదయ, విప్లవ కవిత్వోద్యమాలు ప్రేరణగా వచ్చిన ప్రగతి గీతాల రచన ప్రారంభమైంది. తెలుగు సినిమాల్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ నిషేధాజ్ఞలకు గురైన రైతుబిడ్డ విప్లవాత్మకమే అయినా అందులో ఉపయోగించిన పాటల్లో ఎక్కువగా బసవరాజు అప్పారావు రాసిన భావగీతాలే ఉన్నాయి. సామ్యవాద సిద్ధాంతాల ఛాయలుగల పాటలూ వచ్చాయి. అందులో ఒకటి కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీ దాన’. ఈ పాటకు కారకులు అప్పటి అభ్యుదయవాదులు, వామపక్ష సానుభూతిపరులు. కారులో షికారుకెళ్లే అమ్మాయికి బుగ్గలపై గులాబీ రంగుకు కారణం ఎండలో మాడి కష్టించిన వారి బుగ్గల నిగ్గు ఆమెపైకి వచ్చిందనడం హైక్లాస్ వాళ్లను విమర్శించడం కాదా? సామ్యవాద బీజాలు అప్పటికే బాగా మొలకెత్తాయి. తరువాత శ్రీశ్రీ గీతాలతో తెలుగు పాటలు ఊపందుకున్నాయి. చాకిరొకరిది, సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో.. అనే లైన్‌లో ఉన్నత వర్గాల వారికి ఓ వార్నింగ్ ఇచ్చినట్లయింది. ఈ చిత్రం సంసార పరంగా సాగుతూ కన్నాంబ, అక్కినేని, సావిత్రి తదితర నటుల అసమాన నటనతో, సంగీతపరంగా మాస్టర్ వేణు అందించిన సుమధుర గీతాలతో హిట్టయింది. సినిమా శత దినోత్సవాలు చేసుకుంది. అన్నపూర్ణ ఫిలిమ్స్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి