Others

నాకు నచ్చిన సినిమా - సీతారామ కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1961లో విడుదలై వంద రోజులు ఆడిన పౌరాణిక చిత్రం -సీతారామకల్యాణం. రావణుడిగా రామారావు, మండోదరిగా సరోజాదేవి, జనకుడిగా మిక్కిలినేని, విశ్వామిత్రుడిగా గుమ్మడి, నారదుడిగా కాంతారావు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. కళాదర్శకుడు టివియన్ శర్మ నేతృత్వంలో విజయ- వాహిని స్టూడియోల్లో అడవుల సెట్లు వేశారు. హిందీ సినీ రంగంలో సుప్రసిద్ధుడైన బాబూభాయ్ మిస్ర్తీకి ఫొటోగ్రఫీలో సహాయకుడుగా ఉన్న రవికాంత్ నగాయిచ్ అద్భుత పనితనం ప్రతి ఫ్రేములో కనబడుతుంది. తొమ్మిది డమ్మి తలల బదులు ఒకే తలపై తొమ్మిది షాట్లుతీసి ఆ దృశ్యాలు చిత్రీకరించారాయన. అప్పట్లో ట్రిక్ ఫొటోగ్రఫీలో ఆయనకు ఆయనే సాటి. కైలాస పర్వతాన్ని రావణుడు పైకెత్తే సీనులో నగాయిచ్ ఫొటోగ్రఫీ సౌందర్యం కనబడుతుంది. ఇందులో లక్ష్మీదేవిగా నటించిన ‘మణి’ తర్వాత గీతాంజలి అయింది. హరనాథ్, శోభన్‌బాబులు రామలక్ష్మణులుగా రాణించారు. జనకుని భార్యగా ఛాయాదేవి, గీతాంజలి సొంత చెల్లెలు శూర్పణఖగా నటించారు. ఈ సినిమాలోని సుశీల గానం చేసిన -సీతారాముల కల్యాణం చూతము రారండి.. అనే పాట నేటికీ అన్ని శుభకార్యాలలో మనం వింటూ ఉన్నాం. రావణుని రుద్రవీణకు ప్రసిద్ధ వీణావాద్యకారుడు ఈమని తగువిధంగా సహకరించారు. గీతాంజలికి జి కమలాదేవి, బి సరోజాదేవికి కృష్ణకుమారి అనే ఆవిడ డబ్బింగ్ చెప్పారు. ఒక గీతానికి రామారావు ట్యూన్ తానే సూచించడంతో అప్పటివరకు సంగీత దర్శకుడుగా పనిచేసిన సాలూరివారు అందుకు అంగీకరించక తానే మానుకొన్నారు. అందువల్ల గాలిపెంచల నరసింహారావు ఆ పని నిర్వహించారు. రాజేశ్వరరావు లేని కొరత కనబడింది. ఈ సినిమా విజయం కావడంతో రామారావు తన మరో చిత్రం ‘శ్రీకృష్ణపాండవీయం’ 1966లో విడుదల చేశారు.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం