రాష్ట్రీయం

ఉత్తరాఖండ్‌లో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, డిసెంబర్ 19: ఉత్తరాఖండ్‌లో శనివారం తెల్లవారు జామున ఓ మోస్తరు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదయిన ఈ భూకంపం కేంద్రం భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారు జామున 3.47 గంటలకు సంభవించిన ఈ భూకంపం తీవ్రత ఓ మోస్తరు స్థాయిలోనే ఉండటంతో పాటు ప్రజలు నిద్రలో ఉండటం వల్ల భూకంపం సంభవించిందనే విషయమే చాలా మందికి తెలియలేదని వాతావరణ కేంద్రం వివరించింది. అయితే చమోలి నుంచి అందిన సమాచారం ప్రకారం, జిల్లాలో ప్రజలు భూకంపం వల్ల నిద్రలోనుంచి లేచి భయంతో బయటకు పరుగులు తీశారు. నేపాల్ సరిహద్దులో గల పితోరగఢ్ జిల్లాలోనూ భూమి కంపించింది.

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాది అరెస్టు
శ్రీనగర్, డిసెంబర్ 19: ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు ఫలక్ నూర్ అనే హిజ్‌బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం చెప్పారు. కుప్వారా జిల్లాలోని హంద్వారా ఏరియాలోని అటవీ ప్రాంతంలో ‘ఎ’ కేటగిరీకి చెందిన ఉగ్రవాది ఫలక్ నూర్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో నూర్ గత రెండేళ్లుగా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాడని వారు వివరించారు.