రాష్ట్రీయం

అంగన్‌వాడి కేంద్రాల్లోనే గర్భిణులకు భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు: మంత్రి తుమ్మల
హైదరాబాద్, నవంబర్ 30: అంగన్‌వాడి కేంద్రాల నిర్వాహణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని, గత తొమ్మిది నెలల నుంచి పైసా ఇవ్వలేదని రోడ్లు భవనాలు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్ర్తి శిశు సంక్షేమ శాఖపై సోమవారం సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 37వేల అంగన్‌వాడి కేంద్రాలు ఉన్నాయని, మరే రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో అంగన్‌వాడి కేంద్రాలు లేవని తెలిపారు. నిధుల కొరత లేకుండా తెలంగాణ ప్రభు త్వం జాగ్రత్త తీసుకుంటోందని తెలిపారు. అంగన్ వాడి కేంద్రాల్లో హాజరును సమీక్షించాలని అధికారులకు మంత్రి సూచించారు. 3-6 సంవత్సరాల లోపు పిల్లలు కనీసం 20 మందికి తగ్గకుండా హాజరు నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. గర్భిణీలు, బాలింతలు అంగన్‌వాడి కేంద్రంలోనే భోజ నం చేసే విధంగా ఏర్పాటు చేయాలని, బియ్యం, పప్పులు, కోడి గుడ్లు, పాలు క్రమం తప్పకుండా కేంద్రాలకు సరఫరా అయ్యేట్టు చూడాలని కోరారు. బాలసదనంలో ఉన్న బాలికలందరికీ, ముఖ్యంగా పదవ తరగతి పరీక్షలు రాసే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, ట్యూషన్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని చెప్పారు. కొన్ని అంగన్‌వాడి కేంద్రాల్లో వర్కర్లు వయస్సుపై బడినందున పని చేయలేకపోతున్నారని, వారి స్థానంలో యువతులను నియమించాలని ఆదేశించారు.