రాష్ట్రీయం

పోలీసుల కక్ష సాధింపుపై న్యాయపోరాటం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 28: తాను ఓ బాధితురాలినే తప్ప నిందితురాలిని మాత్రం కాదని, పోలీసులు తనపై ఎందుకు కక్ష సాధింపునకు పాల్పడుతున్నారో తెలియడం లేదని సినీనటి తారాచౌదరి అలియాస్ రాజేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం నేరం చేశానని విజయవాడ పోలీసులు తనపై రౌడీషీటు, పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. అదే నిజమైతే తాను న్యాయపోరాటం చేస్తానంటూ ప్రకటించారు. పలువురు ప్రముఖులపై శృంగార చిత్రాల బ్లాక్‌మెయిలర్ ఆరోపణలతో గతంలో హైదరాబాద్ నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిన తారాచౌదరి కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. నగర శివారు సింగ్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో అద్దెకుంటున్న అన్న, వదిలతో తారాచౌదరికి జరిగిన గొడవను పురస్కరించుకుని మహిళా పోలీసు కానిస్టేబుల్ జ్యోతిపై రగడకు దిగగా.. ఈమెపై నున్న రూరల్ పోలీసులు రెండు కేసులు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇటీవల ఆమె జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే తారాచౌదరిపై పీడీ యాక్టు, రౌడీషీటు తెరుస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆదివారం సాయంత్రం గాంధీనగర్‌లోని తన న్యాయవాది విష్ణ్భుట్ల జయప్రకాష్‌తో కలిసి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. తనపై విజయవాడ పోలీసులు రౌడీషీటు తెరుస్తారని జరుగుతున్న ప్రచారంపై ఆమె మండిపడ్డారు. అంతటి నేరాలేమీ తాను చేయలేదని, గతంలో హైదరాబాద్‌లో బంజారాహిల్స్ పోలీస్టేషన్‌లో ఏసిపి శంకర్‌రెడ్డి అప్పట్లో అక్రమ కేసులు బనాయించారని, ఇప్పుడు తాజాగా విజయవాడ పోలీసులు కూడా కక్ష సాధింపు దిశగానే తన పట్ల వ్యవహరించి అరెస్టు చేశారని ఆరోపించారు. తన సోదరుడు శ్రీనివాస్, వదినల మధ్య నెలకొన్న ఆస్తి సంబంధ వ్యవహారాల నేపథ్యంలోనే ఈ నెల 11న వదిన కవిత ఫిర్యాదు మేరకు నున్న పోలీసులు కేసులు బనాయించారన్నారు. ఆ సమయంలో తన పట్ల ఎస్‌ఐ శివప్రసాద్ అమానుషంగా వ్యవహరించారని, అర్ధరాత్రి నున్న శివారులోని నిర్మానుష్య రోడ్లలో వాహనంలో ఎక్కించి తిప్పారంటూ ఆరోపించారు.

ఎపిఐఐసి డైరక్టర్‌గా ఫణికిశోర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిఐఐసి) బోర్డు డైరక్టర్‌గా రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఫణి కిషోర్‌ను రాష్ట్రప్రభుత్వం నియమించింది. ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ నుంచి కూడా బోర్డులో ప్రాతినిధ్యం ఉంటే మంచిదని బోర్డు విసి, ఎండి చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించిన అనంతరం ఫణికిషోర్‌ను మరో డైరక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

కేజ్రీవాల్, మరో ఐదుగురిపై
పరువునష్టం దావా
అరుణ్ జైట్లీ ప్రకటన నేడు కేసుల దాఖలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: డిడిసిఎ వ్యవహారానికి సంబంధించి తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై పరువు నష్టం దావావేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయించుకున్నారు. వీరిపై ఢిల్లీ హైకోర్టులోనూ, పాటియాలా హౌజ్ కోర్టుల్లోనూ సోమవారం క్రిమినల్, పరువు నష్టం కేసులు దాఖలు చేయాలని తన న్యాయవాదుల బృందాన్ని కోరారు. వ్యక్తిగత హోదాలోనే వీరిపై కేసులు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నానని, తన, తన కుటుంబ సభ్యుల పరువు తీసే విధంగా వీరందరూ ప్రకటనలు చేస్తున్నారని జైట్లీ అన్నారు. తనకే కాదు తన కుటుంబ సభ్యులెవరికీ ఏ వ్యాపారంలోనూ ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు.
కొరియోగ్రాఫర్ భరత్ ఆత్మహత్య
ప్రేమవ్యవహారమే కారణం
సనత్‌నగర్ పోలీసుల దర్యాప్తు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 20: ఓ టివి ఛానెల్ నిర్వహిస్తున్న డాన్స్ ప్రోగ్రామ్‌లో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న భరత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆయన ప్రాణాలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఈ విషయం వెలుగుచూసింది. సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మోతీనగర్‌లో నివాసముంటున్న భరత్ కొనే్నళ్లుగా కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని సీరియళ్లలోనూ, మరికొన్ని చిత్రాలకు నృత్య దర్శకుడిగా పనిచేసి పేరుతెచ్చుకున్నారు. కాగా శనివారం అర్ధరాత్రి దాటాక భరత్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీలు, ప్రేమ వ్యవహారం బలవన్మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయే దాకా భరత్ సెల్‌ఫోన్‌లో వచ్చిన మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరి నుంచి భరత్ డబ్బులు తీసుకున్నారని, ప్రేమిస్తున్న ఓ యువతి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంవంటి సంఘటనలు ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. సనత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
తహశీల్దార్ సంధ్యారాణిని
ప్రశ్నిస్తున్న ఏసిబి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 20:లంచం తీసుకుంటూ పట్టుబడిన అంబర్‌పేట తహశీల్దార్ సంధ్యారాణిని ఏసిబి అధికారులు ప్రశ్నిస్తున్నారు. అంబర్‌పేటకు చెందిన ఓ వ్యాపారి వద్ద ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎన్‌ఓసి ఇచ్చేందుకు ఆమె నాలుగు లక్షలు లంచం అడిగారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేయగా ఆమె తప్పించుకుని ఏసిబి కోర్టులో లొంగిపోయిన విషయం విదితమే. కాగా ఆదివారం కోర్టు అనుమతితో ఆమెను ఏసిబి అధికారులు ప్రశ్నిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయంలో తనిఖీ చేస్తుండగా ఎందుకు పారిపోయారని, రెండ్రోజులు కనిపించకుండా ఆఫీసుకు ఎందుకు రాలేదని, తన సోదరుడితో కలిసి ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆమెను ప్రశ్నించారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, అందువల్లే తాను ఆఫీసుకు రాలేకపోయానని ఆమె జవాబిచ్చినట్లు తెలిసింది. ఈ విచారణ సోమవారం కూడా జరుగుతుందని, మంగళవారం నివేదికను కోర్టుకు సమర్పించనున్నట్టు ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

దిగజారుతున్న
రాజకీయ విలువలు
సిపిఐ నారాయణ ఆవేదన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 20: దేశంలో రాజకీయ విలువలు దిగజారి పోతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో స్వాతంత్య్ర సమరయోధులు ఏటూరి కృష్ణమూర్తి 93 జన్మదినం సందర్భంగా ‘స్వాతంత్య్ర సమరయోధుల ఆవిర్భావం-అంతర్ధానం’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ కృష్ణమూర్తి కుటుంబంతో తాము అత్యంత సన్నిహితంగా ఉంటామని అన్నారు. ఈనాటి రాజకీయ నేతలు నైతిక విలువలను కాలరాస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధులు, సిపిఐ ఇరు రాష్ట్రాల కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

క్రీమిలేయర్ జీవోను
ఉపసంహరించండి
కెసిఆర్‌కు ఎమ్మెల్యే రేవంత్ లేఖ

హైదరాబాద్, డిసెంబర్ 20: క్రీమిలేయర్ అమలుకు జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 లక్షల రూపాయల ఆదాయం దాటిన వారికి క్రీమిలేయర్ అమలు చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో బిసి యువత తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో బిసిలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత టిడిపి ప్రభుత్వానిదేనని అన్నారు. తెలంగాణలో బిసిలను ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరింత వెనుకబడే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.