రాష్ట్రీయం

ఆరుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి / చిట్యాల, డిసెంబర్ 16: కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో బుధవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలోని స్థంభంపెల్లి - కొత్తపెల్లి మార్గ మధ్యన వరంగల్ - రాయపట్నం రాష్ట్ర రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు విగతజీవులైనారు. ఆదిలాబా ద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తూ రు, గంపలపల్లె వాస్తవ్యులు. వీరు కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలలో జరిగిన వివాహ వేడుకలలో పాల్గొన్న అనంతరం ఎపి 1 ఎఎఫ్ 8356 నెంబరు గల హీరోహోండా స్ప్లెండర్ ప్లస్‌పై తిరుగు ప్రయాణంలో ముగ్గురు బయలు దేరారు. స్థంభంపెల్లి - కొత్తపెల్లి మధ్య రాష్ట్ర రహదారిపై వెళ్తూ.. లారీని ఓవర్‌టేక్ చేయబోయి, ఎదురుగా వస్తున్న ఆదిలాబాద్ డిపోకు చెందిన టిఎస్ 01 యూఏ 3531 నెంబరు గల ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సును ఢీకొనగా, మోటపలుకుల ప్రవీణ్ (13), ఎగ్గిడి శ్రీ్ధర్ (16)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు మంద అశోక్ (23) తీవ్రగాయాల పాలు కాగా, 108 వాహనంలో కరీంనగర్‌కు చికిత్సకై తరలిస్తుండగా, ధర్మారం సమీపాన మృతి చెందాడు. ధర్మపురి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాల య్యారు. తాళ్ళవెల్లంల శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో మృతిచెందిన వారు మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన గోసుకొండ బుచ్చయ్య (60), కుమారుడు నర్సింహ (36), గుంజి వెంకటేశ్వర్లు (48)లు ముగ్గురు వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్రవాహనంపై చిట్యాలకు వస్తుండగా మండలంలోని తాళ్ళవెల్లంల-వెంబావి గ్రామ శివారులోకి రాగానే ఉరుమడ్ల గ్రామంలోని ప్రగతి ఉన్నత పాఠశాలకు చెందిన బస్సు తాళ్ళవెల్లంలకు వెళ్తుం డగా.. గ్రామాల శివారులో ఉన్న మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం బస్సును ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కేసుదర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ రూరల్ సి ఐ కె. శివరాంరెడ్డి తెలిపారు.