రాష్ట్రీయం

దక్షిణ మధ్య రైల్వేకు విద్యుత్ పొదుపు అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: విద్యుత్ పొదుపులో దక్షిణ మధ్య రైల్వే ఏడు అవార్డులు సాధించింది. వివిధ విభాగాల్లో విద్యుత్‌ను ఆదా చేసినందుకు భారత రైల్వే శాఖ ప్రకటించిన 24 అవార్డుల్లో ఏడు అవార్డులు దక్షిణ మధ్య రైల్వే దక్కించుకుందని ముఖ్య ప్రజా సంబంధాల శాఖ అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. 2014-15లో గత సంవత్సరం కంటే 24.75శాతం విద్యుత్‌ను ఆదా చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా ప్రథమ అవార్డును కేంద్ర విద్యుత్, బొగ్గుగనుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అందుకున్నారు. కాజీపేట జంక్షన్ పంప్‌హౌస్‌లో 37.93శాతం విద్యుత్‌ను ఆదా చేసినందుకు చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సోలన్ గుప్తా రెండో అవార్డును అందుకున్నారు. అదేవిధంగా షీప్ మండి పంప్ హౌస్ జనరల్ కేటగిరి సెక్టార్‌లో 21.90శాతం, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో 27.28 శాతం, సంచాలన్ భవన్ సికిందరాబాద్ బిల్డింగ్‌లో 22శాతం, లాలాగూడ సెంట్రల్ ఆసుపత్రిలో 16.56 శాతం, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 19.18శాతం విద్యుత్ ఆదా చేయడంతో ఐదు అవార్డులు అందుకున్నట్టు ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు.
2014-15లో దక్షిణ మధ్య రైల్వే 8.56 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయడంతో రూ. 68.91 లక్షలు సంస్థకు మిగులుబాటైందని వివరించారు.