రాష్ట్రీయం

నిబంధనలు పాటించని ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటర్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: గ్రేటర్ హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతిలేకుండా నడుస్తున్న అనాథ, వృద్ధాప్య కేంద్రాలపై అధికారులు దృష్టి సారించారు. లైసెన్సు లేకుండా నడుస్తున్న కేంద్రాలకు నోటీసులు జారీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఎలాంటి అనుమతిలేని కేంద్రాలు నిబంధనలకు లోబడి నిర్వహించేలా లైసెన్సులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏడు వందల కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగానే నడుస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో కూడా వందకు పైగా కౌనె్సలింగ్ కేంద్రాలున్నట్టు గుర్తించినట్టు ఓ ఐసిడిఎస్ అధికారి చెప్పారు. వాటిలో కేవలం 23 కేంద్రాలకు మాత్రమే అనుమతి ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది.
ఇదిలావుండగా జివో ఎంఎస్ 30 ప్రకారం ఫ్యామిలీ కౌనె్సలింగ్, అనాథ, వృద్ధాప్య కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలి లేనిపక్షంలో ఆ కేంద్రాలను సీజ్ చేసే అధికారం ఐసిడిఎస్ కమిటీకి ఉంది. ఈ కమిటీలో ప్రతి జిల్లా కలెక్టర్ చైర్మన్ గానూ ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కన్వీనర్ గానూ, జాయింట్ పోలీసు కమిషనర్ సభ్యుడిగా ఉంటారు. అదే హైదరాబాద్‌లో అయితే ఈ ముగ్గురికి అదనంగా కార్మిక, విద్య, వికలాంగుల శాఖకు చెందిన అధికారులతోపాటు అదనపు పోలీసు కమిషనర్‌తో కూడిన ఏడుగురు సభ్యులు కమిటీ ఉంటుంది.
కాగా ఆయా సంస్థల నిర్వాహకులు లైసెన్సు కోసం వీరికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన తరువాత కమిటీ లైసెన్సులు జారీ చేస్తుంది. ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటర్లతోపాటు అనాథ, వృధ్యాప్య, ఉమెన్స్ హాస్టళ్ల నిర్వాహకులు కూడా తప్పనిసరిగా లైసెన్సులు తీసుకోవాలని కమిటీ సూచించింది.
నగరంలో 7వందలకు పైగా ఉన్న కేంద్రాలలో కేవలం 23 కేంద్రాలకు మాత్రమే లైసెన్సులున్నట్టు అధికారులు గుర్తించారు. కేవలం కొద్దిపాటి కేంద్రాలు మాత్రమే లైసెన్సులు తీసుకున్నాయని మిగతా వారు వెంటనే లైసెన్సు తీసుకోవాలని లేనిపక్షంలో ఆయా కేంద్రాల నిర్వాహకులపై చర్య తీసుకోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో వందకు పైగా కౌనె్సలింగ్ కేంద్రాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో 44కేంద్రాలకు చెందిన నిర్వాహకులు దరఖాస్తులు చేసుకున్నారని వీటిలో 14మందికి లైసెన్సులు జారీ చేసినట్టు ఓ అధికారి తెలిపారు. మిగతా వారికి లైసెన్సులు తీసుకోవాల్సిందిగా నోటీసులు జారీ చేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. నోటీసులపై స్పందించని సంస్థల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ఐసిడిఎస్ అధికారులు పేర్కొంటున్నారు.