రాష్ట్రీయం

గ్రేటర్‌లో గెలవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 14: హైదరాబాద్ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణ కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం ఉదయం తన నివాస గృహం నుంచి హైదరాబాద్‌కు చెందిన తెలుగుదేశం ప్రముఖులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గతంలో తొమ్మిదేళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అంకితభావంతో పనిచేయటం వల్లనే అనుకున్న లక్ష్యాలను సాధించగలిగామన్నారు. ప్రధానంగా సైబరాబాద్ సిటీని సృష్టించగలిగామన్నారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన హైటెక్ సిటీ నిర్మాణాన్ని చేపట్టగలిగామన్నారు.
తాను చేపట్టిన అభివృద్ధి పనుల వల్లనే నేడు తెలంగాణకు హైదరాబాద్ ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వంనుంచి పెద్దఎత్తున నిధులను సమీకరించి హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయటం తెలుగుదేశం, బిజెపి కూటమి ద్వారానే సాధ్యవౌతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరినీ కలిసి వాస్తవ పరిస్థితులను తెలియజేసి గెలుపు కోసం కృషి చేయాలని తెలుగుదేశం నాయకులను చంద్రబాబు కోరారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తాత్కాలిక కార్యాలయాల నుంచే పరిపాలన సాగిస్తున్నామన్నారు.