రాష్ట్రీయం

పాలమూరు, డిండి అక్రమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27:కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. గత సంవత్సరం జలాల వినియోగంపై వివాదం తలెత్తడంతో ఈసారి ముందుగానే రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయం వెల్లడించాలని బోర్డు కోరింది. అయితే బోర్డు సమావేశానికి హాజరైన ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు తమ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తరువాతే నిర్ణయం చెబుతామని అన్నారు. ఏ అంశంపైనా ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. గత సంవత్సరం కేటాయించిన విధంగానే ఈ సంవత్సరమూ నీటి కేటాయింపులు జరపాలా? లేక మార్పులు కోరుతున్నారా? స్పష్టంగా చెప్పాలని బోర్డు కోరింది. కృష్ణా జలాల్లో 811 టిఎంసిల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిల కేటాయింపు ఉంది. ఈ నిర్ణయం ఒక్క సంవత్సరానికే వర్తిస్తుందని గత ఏడాది నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలు ఒప్పుకుంటేనే దీనిని కొనసాగిస్తారు. అయితే రెండు రాష్ట్రాలు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ సూచించగా, తెలంగాణ దానికి సమ్మతించలేదని తెలిసింది. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన పాలమూరు ఎత్తి పోతల పథకం, డిండి పథకం అక్రమమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డు దృష్టికి తీసుకు వచ్చింది. కాగా అవి ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పథకాలే అని తెలంగాణ వివరించింది. గత సంవత్సరం నీటి పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం కేంద్ర మంత్రి ఉమా భారతి సమక్షంలో తాత్కాలిక పరిష్కారం కుదిరింది. శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ నిర్వహించే విధంగా, నాగార్జున సాగర్‌ను తెలంగాణ నిర్వహించే విధంగా గత సంవత్సరం ఉమా భారతి సమక్షంలో తాత్కాలిక ఒప్పందం కుదిరింది. దీనిని ఈ సంవత్సరం కూడా కొనసాగించే అంశంపై ఎలాంటి నిర్ణయానికి రాలేదు. బోర్డ్ చైర్మన్ ఎస్‌ఎ నాథన్, బోర్డు కార్యదర్శి కె గుప్తా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు బోర్డు సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల పథకానికి శంకుస్థాపన చేసిన తెలంగాణ సీఎం కెసిఆర్ (ఫైల్ ఫొటో)