రాష్ట్రీయం

టీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేసిన మావోయిస్టులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేతల కదలికలపై ఆరా తీసిన కెకెడబ్ల్యు నేత
పినపాక, నవంబర్ 24: ఖమ్మం-వరంగల్ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తరుచుగా సంచరించే అధికార పార్టీకి చెందిన నేతలను ఉత్తర తెలంగాణ మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. అభివృద్ధి పనుల సమీక్ష కోసం తరుచుగా ఏజెన్సీ ప్రాంతాల్లో సంచరించే నేతల కదిలికలపై కెకెడబ్ల్యు నేత ఆధ్వర్యంలో సరిహద్దు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పినపాక, గుండాల, తాడ్వాయి మండలాల్లో అధికార పార్టీకి చెందిన నేతల వివరాలు సేకరించినట్లు సమాచారం. దట్టమైన అటవీ ప్రాంతాల్లో రహస్య సమావేశం నిర్వహించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దుప్రాంతాల్లో పట్టుకోల్పోయి సానుభూతిపరులకు దూరమైన మావోయిస్టు పార్టీ ఏజెన్సీ గ్రామాల్లో సంచరించకుండా కావలసిన సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన కరకగూడెం, చిరుమళ్ళ, జానంపేట తదితర గ్రామాల్లో గత వారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత మావోలు వేగం పెంచినట్లు తెలుస్తోంది.