రాష్ట్రీయం

టిఆర్‌ఎస్ ఖాతాలో ఆరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రెండు స్థానాల్లో గులాబీ రెపరెపలు
మరో ఆరు స్థానాలకు పోటీ
ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ
నాలుగు జిల్లాల్లో 27న పోలింగ్

హైదరాబాద్, డిసెంబర్ 12:శాసన మండలి ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ శనివారంతో ముగిసింది. 12 స్థానాల్లో ఐదు జిల్లాల్లోని ఆరు మండలి స్థానాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరుగురు శాసన మండలి సభ్యులుగా ఎన్నికైనట్టు ఆయా జిల్లాల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. నాలుగు జిల్లాల్లోని ఆరు స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరుగుతుంది.
కరీంనగర్ జిల్లాలో రెండు మండలి స్థానాలు ఉండగా, మిగిలిన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఇద్దరు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అదేవిధంగా నిజామాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డి కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. వరంగల్ నుంచి కొండా మురళి, ఆదిలాబాద్ నుంచి పురాణం సతీష్, మెదక్‌నుంచి భూపాల్‌రెడ్డి, నిజామాబాద్‌నుంచి భూపతిరెడ్డి, కరీంనగర్‌నుంచి నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నల్లగొండ నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్థి రంగం నామినేషన్ ఉపసంహరించుకోగా, టిఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిల మధ్య బలమైన పోటీ ఉంది. ఇక ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, టిడిపిలు బరిలో లేవు. సిపిఐ అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. టిఆర్‌ఎస్ నుంచి బాలసాని లక్ష్మీనారాయణ, సిపిఐ నుంచి పువ్వాడ పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. ఇద్దరు ఇండిపెండెంట్‌లు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి రంగంలో నిలిచారు. అయితే సిపిఐ వ్యూహాత్మకంగా లక్ష్మీనారాయణ అనే పేరున్న ఇద్దరిని ఇండిపెండెంట్‌లుగా రంగంలో నిలబెట్టింది. టిఆర్‌ఎస్ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణకు ఓటు వేయాలనుకనే వారిలో గందరగోళం తలెత్తాలనే ఉద్దేశంతో ఆదే పేరుతో ఉన్న ఇద్దరినిని రంగంలో సిపిఐ నిలిపిందని టిఆర్‌ఎస్ విమర్శిస్తోంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు స్థానాలు, రంగారెడ్డిలో రెండు, ఖమ్మంలో ఒకటి నల్లగొండలో ఒకటి నాలుగు జిల్లాల్లో మొత్తం ఆరు స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరుగుతుంది. 30న ఓట్లు లెక్కిస్తారు.
ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన వరంగల్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఐదు జిల్లాల్లో ఎన్నికల నియమావళి నేటితో ముగిసిందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఎన్నికలకు క్యాంపులు నిర్వహిస్తే సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ హెచ్చరించారు.
పదవులతో పొంగిపోం..
ఈ విజయం అమరులకే అంకితం
ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు
కరీంనగర్, డిసెంబర్ 12: తన ఏకగ్రీవ ఎన్నిక తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నానని ఎమ్మెల్సీగా ఎన్నికైన నారదాసు లక్ష్మణ్‌రావు అన్నారు. కెసిఆర్ పాలనకు ఈ ఏకగ్రీవమే నిదర్శనమని చెప్పారు. ఏకగ్రీవ అవకాశం కల్పించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. టిఆర్‌ఎస్‌కు పదవులు ముఖ్యం కాదని, అభివృద్ధే లక్ష్యమని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో చిత్తశుద్ధితో భాగస్వాములమవుతామని, అమరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని లక్ష్మణ్‌రావు తెలిపారు.
నమ్మకాన్ని వమ్ము చేయం: భానుప్రసాదరావు హామీ
ప్రజాప్రతినిధులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా చిత్తశుద్ధితో పనిచేస్తామని ఎమ్మెల్సీగా ఎన్నికైన తానిపర్తి భానుప్రసాద రావు అన్నారు. ఏకగ్రీవానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.