రాష్ట్రీయం

ఫిరాయింపులే తెరాస అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కెసిఆర్‌కు బుద్ధి చెబుతాం * సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, చాడ

ఖమ్మం, డిసెంబర్ 5: పార్టీ పిరాయింపులే ప్రధాన అజెండాగా చేసుకొని టిఆర్‌ఎస్ దిగజారుడుతనాన్ని అవలంబిస్తోందని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శనివారం వామపక్ష పార్టీల అభ్యర్థి పువ్వాడ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను, హామీలను మాటలకు, ప్రచారానికే పరిమితం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో విజయం కోసం అడ్డదారులు ఎంచుకుంటోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకుంటూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. అభివృద్ధి జరుగుతుందంటే ఆ ఘనత వామపక్ష పార్టీలకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇతర పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేస్తున్న కెసిఆర్‌కు కళ్ళెం వేసేందుకు ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం అన్ని పార్టీల మద్దతు తీసుకుంటామన్నారు.
పువ్వాడ నామినేషన్ దాఖలు
జిల్లా అభివృద్ధి సాధించిందంటే ఆ ఘనత కమ్యూనిస్టులకే దక్కుతుందని, అనేక ఏళ్ళ కమ్యూనిస్టుల పోరాటాల వల్లనే అభివృద్ధి సాధ్యమైందని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానానికి వామపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థి, సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ఐక్యంగా కలిసి పోటీ చేసినప్పుడల్లా విజయం సాధించామని, ఇప్పుడు ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం తథ్యమని జోస్యం చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపు కోసం దిగజారుడుతనాన్ని అవలంబిస్తోందని ఆరోపించారు. ఇతర పార్టీల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తూ టిఆర్‌ఎస్‌లోకి చేర్చుకునేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నాడన్నారు. ఈ రోజు వామపక్ష పార్టీల అభ్యర్థిగా పువ్వాడ వేసిన నామినేషన్ ప్రత్యేకత సంతరించుకోనున్నదని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎంపిటిసిలను, జడ్పిటిసిలను టిఆర్‌ఎస్ పార్టీ డబ్బులతో కొనాలని చూస్తోందని, దీనిని సహించేది లేదన్నారు. టిఆర్‌ఎస్ చేస్తున్న దౌర్జన్యాలను ప్రతిఘటిస్తామని, ఈ ఎన్నిక ద్వారా గట్టి బుద్ధి చెప్తామన్నారు. పథకాలను, హామీలను మాటలకు, ప్రచారాలకే పరిమితం చేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలులో మాత్రం వైఫ ల్యం చెందిందంన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటీలో ఉండడం లేదని, వారి మద్దతు వామపక్ష అభ్యర్థి గెలుపు కోసం కోరతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ పిరాయింపులను ప్రొత్సహిస్తున్న టిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పే విధంగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించి అందరి మద్దతు కూడగడతామన్నారు. ఐక్యత కోసం శక్తులన్నింటిని ఏకం చేస్తామని వెల్లడించారు. 1964 చీలిక తర్వాత వామపక్ష పార్టీలు 1981లో ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థి పువ్వాడను నిలబెట్టామన్నారు.