Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం కూడా తెలుగు సినిమా బాక్సాఫీస్ ఆశాజనకంగా లేదు. భారీ అంచనాలతో పూరి జగన్నాథ్, వరుణ్‌తేజ్ తొలి కాంబినేషన్‌లో వచ్చిన ‘లోఫర్’, ‘అందమైన మాయ’, ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్’ చిత్రాలతోపాటుగా హిందీనుండి వచ్చిన ‘బాజీరావు మస్తాని’, ‘దిల్‌వాలే’తో పాటుగా తమిళం నుంచి అనువదించిన సమంత, ధనుష్‌ల ‘నవమన్మధుడు’ చిత్రాలు విడుదలయ్యాయి. ‘లోఫర్’ చిత్రం సరైన కథకథనాలు లేక చతికిలపడింది. పూరి జగన్నాథ్ మార్కు మరోసారి తెలుగు తెరపై మ్యాజిక్ చేయలేకపోయింది. నవమన్మధుడు కథాకథనం బాగున్నా సరైన కలక్షన్లు రాబట్టలేకపోతోంది. ఇక అందమైన మాయ, బెస్ట్ ఫ్రెండ్స్ మామూలుగా కూడా ఆకట్టుకోలేకపోయాయి. షారుఖ్‌ఖాన్ వ్యతిరేక వ్యాఖ్యానాల నేపధ్యంలో విడుదలైన ‘దిల్‌వాలే’కు ప్రేక్షకాదరణ దక్కలేదు. బాజీరావు మస్తానిలో సంజయ్‌లీలా బన్సాలీ మార్కు మరోసారి తెరపై ప్రేక్షకులను ముగ్ధుల్ని చేస్తోంది. సినిమా కలక్షన్లు సోసోగా ఉన్నా, సినిమా ప్రేమకుల్ని ఆకట్టుకుంటోంది.