రాష్ట్రీయం

ఇక హెలీ టూరిజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గగనతలం నుంచి రాజధాని సందర్శన
బౌద్ధ, జైన, రామాయణ సర్క్యూట్‌ల అభివృద్ధి
పర్యాటక శాఖ సరికొత్త ప్రణాళిక

హైదరాబాద్, డిసెంబర్ 7: హెలికాఫ్టర్ నుంచి హైదరాబాద్ నగర అందాలను తిలకించే అవకాశం పర్యాటకులకు త్వరలోనే కలగనుంది. పర్యాటక శాఖ ప్రయత్నాలు ఫలిస్తే పర్యాటకులు ఇకపై హెలికాఫ్టర్ నుంచి హైదరాబాద్ అందాలు తిలకించొచ్చు. హైదరాబాద్ నగరంపై గగనతల విహారం చేసేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. హెలీ టూరిజంతోపాటు సీ ప్లేన్, హాట్ ఎయిర్ బెలున్‌ల సాయంతో హైదరాబాద్ నగరాన్ని ఆకాశం నుంచి వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా విదేశీ పర్యాటకులను తెలంగాణకు ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించేలా టూర్ ఆపరేటర్లతో పర్యాటక శాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. తెలంగాణ టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై ఆ శాఖ మంత్రి చందులాల్ సోమవారం సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా, పరివాహక ప్రాంతాల్లో గిరిజన, ఎకో టూరిజాలను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతం పరిసరాల్లోని సోమశిల, ఫరహాబాద్, మల్లెల తీర్థం, శ్రీశైలం ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. వరంగల్ జిల్లాలోని మేడారం, లక్నవరం, తాడ్వాయి, మల్లూరు, గటమ్మ దేవాలయాలను గిరిజన టూరిజంలో భాగంగా అభివృద్ధి పర్చనున్నట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే బౌద్ధ, జైన, రామాయణ సర్క్యూట్‌లుగా తెలంగాణలోని పలు ప్రాంతాలను అభివృద్ధి చేయబోతున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ బౌద్ధ సందర్శన స్థలాలు, జైన స్థలాలు అదేవిధంగా శ్రీరాముని ఆలయాలను పర్యాటకులు సందర్శించే విధంగా ఈ సర్క్యూట్‌లను రూపొందించనున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలోనే అమలు చేస్తామన్నారు. జనవరిలో హైదరాబాద్ నగరంలో పెరల్స్ ఫెస్టివల్‌ను అంతర్జాతీయస్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని చందూలాల్ అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రపంచంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం లభించేలా పర్యాటక శాఖ కృషి చేస్తోందన్నారు. పర్యాటక ప్రాంతాలను సందర్శించే పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు కిస్ట్రినా చొంగ్తూ తదితరులు పాల్గొన్నారు.