రాష్ట్రీయం

పెరగనున్న నియోజకవర్గాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రలో మరో 50, తెలంగాణలో మరో 34 అసెంబ్లీ సీట్లు
విభజన చట్టం సవరణకు ఏపితో పాటు పట్టుపట్టనున్న తెలంగాణ

హైదరాబాద్, నవంబర్ 23: విభజన చట్టంలో సవరణ కోసం పట్టుపట్టి ఉభయ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన కోసం తీవ్రంగా ప్రయత్నించాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. గతంలో ఈ అంశాన్ని టిఆర్‌ఎస్ పెద్దగా పట్టించుకోక పోయినా ఇప్పుడు ప్రధానంగా దీనిపై దృష్టి సారించాలని నిర్ణయించారు. విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్‌లో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు, తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని ఉంది. అయితే విభజన చట్టంలోని చిన్న మెలికను అప్పుడు గుర్తించక పోవడం వల్ల ఇప్పుడు సమస్య వచ్చి పడిందని తెలిసింది. విభజన చట్టంలో నియోజకవర్గాల పెంపు గురించి ఉన్నా, రాజ్యాంగంలోని 17వ నిబంధన మేరకు జరపాలని ఉంది. నియోజకవర్గాల పునర్విభజన 2009లోనే జరగడం వల్ల మరో రెండు దశాబ్దాల వరకు అవకాశం లేదు. అయితే విభజన చట్టంలోని ఆ మెలికను సవరిస్తూ పార్లమెంటులో తీర్మానం చేస్తే ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెంచే విధంగా విభజన చట్టంలో చేర్చారు. 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్న ఆంధ్రలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజక వర్గాలు పెరిగే అవకాశం ఉంది.
నియోజక వర్గాల పెంపుదల చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే ప్రధానమంత్రికి లేఖ రాశారని టిఆర్‌ఎస్ ఎంపి బి వినోద్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సైతం కోరుతున్నందున రెండు రాష్ట్రాల అంగీకారం ఉంది కాబట్టి ప్రధానమంత్రి సుముఖత వ్యక్తం చేస్తే పార్లమెంటులో అరగంటలో పని అయిపోతుందని వినోద్ తెలిపారు. గతంలో ఈ అంశంపై పట్టుపట్టలేదని, కానీ ఇప్పుడు అడుగుతామని చెప్పారు. ఈనెల 26,27 తేదీల్లో కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ మంత్రులను ఈ అంశంపై కలిసి మాట్లాడతామని చెప్పారు. రెండు రాష్ట్రాలది ఒకే సమస్య కావడంతో ఉమ్మడిగా ప్రయత్నించడం ద్వారా సాధించుకోవచ్చుననే అభిప్రాయం టిఆర్‌ఎస్ ఎంపీల్లో ఉంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావలసిన వాటిలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని, నియోజక వర్గాల సంఖ్య పెంచితే ఆర్థికంగా కేంద్రంపై భారం అంటూ ఏమీ ఉండదు కాబట్టి కేంద్రానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏమీ లేదని వినోద్ తెలిపారు. తెలంగాణలో జిల్లాల సంఖ్యను పెంచాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, ఈలోగా నియోజక వర్గాల సంఖ్య పెరిగితే జిల్లాల ఏర్పాటుకు ఇబ్బంది ఉండదని తెలిపారు.
కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత నియోజక వర్గాల సంఖ్య పెంచాల్సి వస్తే అదో సమస్యగా మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడే నియోజక వర్గాల సంఖ్యను పెంచేతే దానికి అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు.