రాష్ట్రీయం

గుట్ట అభివృద్ధి పనులకు సాంకేతిక కమిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 7: యాదగిరి గుట్ట అభివృద్ధి పనుల నిర్వహణకు సాంకేతిక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్, సభ్యులుగా దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్, హెచ్‌ఎండిఏ రిటైర్డ్ సిఇఓ యు.మద్వరాజా, ప్లానర్ ఎస్‌పి షోరీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సప్తపతి రఘునాథ్ మహాపాత్రోతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేస్తూ జివో జారీ చేసింది. యాదగిరి గుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీకి సాంకేతిక అంశాలకు సంబంధించి ఈ కమిటీ సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలిపింది. టెంటర్ల స్వీకరణ పద్దతి, నిర్మాణ పనులు నిర్వహణ, సమర్ధవంతంగా పనులను చేపట్టడం వంటి అంశాల్లో కమిటీ తన సహాయ సహకారాలను అందించాలని ప్రభుత్వం నిర్ధేశించింది.

నిధుల తరలింపుపై సిబిఐకి ఫిర్యాదు చేయండి
అధికారిక లిక్విడేటర్‌ను ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 7: స్టేట్‌బ్యాంక్, మరికొన్ని బ్యాంకుల నుంచి లిక్విడేషన్ కింద అక్రమంగా తరలించిన నిధులకు సంబంధించి సిబిఐకి తగిన పద్దతిలో ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే విధంగా చూడాలని ఆల్విన్ వాచ్ కంపెనీ తరఫున ఉన్న అధికారిక లిక్విడేటర్‌ను హైకోర్టు జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్ ఆదేశించారు. ఆల్విన్ వాచ్‌స్ లిమిటెడ్ తరఫున ఉన్న అధికారిక లిక్విడేటర్ దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. రూ.9 కోట్లను మోసపూరితంగా తరలించిన సంఘటనపై విచారణకు ఆదేశించాలని లిక్విడేటర్ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. విచారణ అనంతరం ఈ ఆరోపణలపై సిబిఐకి ఫిర్యాదు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలని జస్టిస్ ఆదేశించారు. అనంతరం ఈ కేసును మంగళవారానికి వాయిదా వేశారు.