రాష్ట్రీయం

గోవధ అంటే భూ వధే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10న గో రక్షా దివస్ పాటిద్దాం
బీఫ్ ఫెస్టివల్‌ను నిరసిద్దాం
స్వామి పరిపూర్ణానంద పిలుపు
కంచె ఐలయ్య ప్రవర్తన మూర్ఖం
సమాజాన్ని భ్రష్టు పట్టించకండి
ఒవైసీ సోదరులకు హితవు

హైదరాబాద్, డిసెంబర్ 5: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొందరు నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్‌ను నిరసిస్తూ గోమాతలను రక్షించేందుకు ఈ నెల 10న ‘గో రక్షా దివస్’గా పాటించాలని శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న భాగ్యనగర్ గో రక్ష సమితి ఆధ్వర్యంలో గోవులకు పూజలు నిర్వహించడం జరుగుతుందని, అదే సమయంలో రాష్టవ్య్రాప్తంగా అందరూ గోవులను పూజించి గో రక్షణకు సంకల్పించాలని కోరారు. శనివారం నాడిక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో స్వామి పరిపూర్ణానంద బీఫ్ ఫెస్టివల్‌పై ఘాటుగా స్పందించారు.
భారతీయుల సంస్కృతీ సంప్రదాయాల్లో గోవుకు విశిష్ట స్థానం కల్పించారని, అలాంటి గోవును బహిరంగంగా వధించి వండుకుని తింటామనడం యావత్ హిందూ జాతిని, వారి మనోభావాలను ఘోరంగా దెబ్బతీయడమే అవుతుందని అన్నారు. బీఫ్ తిన్న వాడు బేవకూఫ్ అని స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొందని ఆయన గుర్తు చేశారు. బీఫ్ విషపూరితమైనదని, దానిని తింటే కొలోనల్ క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, మహిళల్లో హార్మోన్లలో సమతుల్యత దెబ్బతిని రొమ్ముక్యాన్సర్లు వంటి రోగాలు సంక్రమిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ నివేదికలో పేర్కొందని ఆయన తెలిపారు. ప్రొఫెసర్ అయి ఉండి కంచె ఐలయ్య వంటి వారు మూర్ఖంగా ప్రవర్తిస్తూ బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారని, ఒక ప్రొఫెసర్‌గా ఆయనకు ఇది తగదని అన్నారు.
కొందరు స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని, యువతను భ్రష్టు పట్టించే విధంగా ఇలాంటి ఫెస్టివల్స్‌ను విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించడాన్ని ప్రతి ఒక్క హిందువు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడాలంటే అటువంటి వారు ఏ పాకిస్తానో, ఆప్ఘనిస్తాన్ గానీ వెళ్లి మాట్లాడాలని ఆయన పరోక్షంగా ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ‘ఒవైసీ సోదరులిద్దరికీ నేను ఒకటే చెబుతున్నా మీరు లండన్‌లోనో ఎక్కడో చదువుకుని వచ్చారు, ఇలా ఒకరి సంస్కృతిని దెబ్బతీసి సమాజాన్ని భ్రష్టు పట్టించే విధానాలు మానుకోవాలి’ అని హితవు పలికారు. గోవధ అంటే భూ వధే అవుతుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని అన్నారు. గతంలో చక్రవర్తులు గోవులను రక్షించి చరిత్రకెక్కారని, తెలంగాణ, ఎపి ప్రభుత్వాలు కూడా గోవధను ఆపి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలని స్వామి పరిపూర్ణానంద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. (చిత్రం) హైదరాబాద్‌లో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న శ్రీపీఠం వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద