స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
అదృష్టవశాత్తు ఆధ్యాత్మిక జ్ఞాన సాధనా మార్గం తరుచుకొనే భాగ్యముంటే ఆ భగవదుపదేశం అతని చెవి సోకుతుంది. ఈ మంత్రం ఈ విషయానే్న ‘శ్రుణ్వే వృష్టే రివ స్వనః పవమానస్య శుష్మిణః’- జీవులను బాధించే పాప సంతాపాలను హరించే భగవానుని శాంతి ఉపదేశం వర్షధారల శబ్దంవలె వినబడుతూ ఉంది అని సోపమానంగా వివరించింది. అంటే ఏమిటి? జీవులను పాపాలు సంతాపానికే గురిచేస్తాయి. దానివలన వారికి జీవితమంతా అశాంతియే. గ్రీష్మతాపాన్ని వర్షధారలు ఎలా శాంతిపరుస్తాయో అలా భగవదుపదేశం వర్షధారగా వర్షిస్తూ పాప సంతాపాలను శాంతపరుస్తూ ఉన్నాయి. ఎలా అంటే- జీవులకు పాపం సంక్రమించేది అధర్మాచరణ వల్లనే కదా! మరి అది శాంతించాలంటే జీవులపైన ధర్మం మేఘ రూపంగా వచ్చి ధారాపాతంగా వర్షించాలి. ఆ వర్షధారలతో అధర్మంవలన జనించిన తాపం (వేడి) చల్లారిపోతుంది. అంతేకాదు, పాపాల తాపంవలన కలిగన దుఃఖాలనే నల్లని బరద కూడా పూర్తిగా కొట్టుకొని పోతుంది.
అంతేకాదు, వర్ష సమయంలో సహజంగామెరుపులు కూడా వస్తాయి కదా! అందుకే ‘చరంతి విద్యుతో దివి’- ఆకాశంలో మెరుపులు కూడా మెరుస్తున్నాయి అని ఈ మంత్రం వర్ణించింది. ఇక్కడ దివి = ఆకాశమంత బుద్ధిలేని హృదయమనే ఆకాశమని మంత్రాభిప్రాయం. అట్లే మెరుపులు అంటే జ్ఞానజ్యోతులని భావం. ఈ మంత్రాభిప్రాయానే్న శే్వతాశ్వతరోపనిషత్తు మరింత విపులంగా ఇలా చెప్పింది.
నీహారధూమార్కానిలానలానాం, ఖద్యోతవిద్యుత్‌స్ఫటికశశీనామ్
ఏతాని రూపాణి పురఃస్సరాణి / బ్రహ్మణ్యభివ్యక్తికరాణి యోగే
భావం:పొగ మంచు, పొగ, సూర్యుడు, అగ్ని, గాలి, మిణుకుపురుగు, మెరుపు, స్ఫటికం మరియు చంద్రుడు వంటి రూపాలు యోగికి సమాధి స్థితిలో దర్శనమిస్తాయి. విద్యుత్తు అని పై మంత్రంలో చెప్పబడిన మాట వీనిని సూచించదే. లోకంలోని విద్యుత్తు మిరిమిట్లు గొలిపి కళ్లు మూతపడేలా చేస్తుంది. కాని వేదప్రతిపాదితమైన విద్యుత్తు జ్ఞాననేత్రాలను తెరిపించి ఆనందానుభవాన్ని కలిగిస్తుంది. అట్టి అనుభవాన్ని మాటలలో చెప్పడం సాధ్యమా? మనిషి నిస్తారంగా చెబితే శ్రద్ధగా వినేంత శ్రమ తీసికోలేనివాడని తలంచియే భగవానుడీ మంత్రంలో సంక్షిప్తంగా బోధించాడు.
అంతఃశోధనతో ఆత్మజ్ఞానం
త్వామగ్నే అంగిరసో గుహా హితమన్వవిందన్ శిశ్రీయాణం వనే వనే/ స జాయసే మథ్యమానః సహో మహత్‌త్వామాహుః సహస స్పత్రమంగిరః
భావం: ఓ అగ్నిదేవా! అధ్యత్మవేత్తలు సర్వత్ర వ్యాపించియుండే నిన్ను జీవుల హృదయ గుహలలో దర్శిస్తున్నారు. అయితే వారుకూడా తమ హృదయాలలో చిరకాలం నీ గురించి చింతన చేసిన తరువాతనే నీవు వారికి దర్శనమిస్తున్నావు. నీవు సర్వసమర్థుడవు. జీవుల సామర్థ్యాన్ని పరీక్షించే పరీక్షకుడవని నీ గురించి ఆధ్యాత్మవేత్తలు చెబుతున్నారు.
వివరణ:్భగవదనే్వషణ గురించి వేదంలోఒక చోట ‘పశువుల దొంగను పట్టుకోదలచినవారు నేలపై పశువుల గిట్టల జాడలను వెదుకుతూ వెళతారు’ అని చెప్పబడింది. అలాగే జీవుల చిత్తాన్ని హరించిన చిత్త చోరుని (్భగవానుని) జాడను కనుగొనేందుకు అధ్యాత్మవిదులు ప్రయత్నిస్తారు. సాధారణంగా జీవులు తమ చిత్తాన్ని జగత్ప్రభువు దొంగిలించరాదని ఆశిస్తారు. కాని అలా కాక విధాత జీవుని చిత్తాన్ని హరించితే ఇక వ్యాకులతకు స్థానమెక్కడుంటుంది? ఆ రీతిగా చిత్తం హరించపబడినవాని నడుగు. అతడి సమాధాన మీ విధంగా ఉంటుంది.