స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదం మరో ముఖ్య విషయాన్ని కూడ చెబుతూంది. సృష్టిలోని సర్వ వుస్తజాలమూ జీవులతో మధురంగా ఉంటూ మధురంగా వ్యవహరిస్తూంది. మరి నీ వా విధంగా ఎందుకు వ్యవహరింపవు? అని. దీనికి తార్కాణంగా ఈ క్రింది ఋగ్వేదమంత్రాన్ని పరిశీలించండి.
మధు వాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నః సంత్వోషధీః॥
ఋ.1-90-6॥
భావం:- ప్రవహిస్తున్న నదులు జలాలలో తీపినే ప్రవహింప చేస్తున్నాయి. మందమందంగా వీచే గాలి తీపినే వెదజల్లుతూంది. పెరిగే ఓషధులన్నీ మాధుర్యానే్న పంచుతున్నాయి.
మధు నక్తముతోషసో మధుమత్ పార్థివం రజః మధు ద్యౌరస్తు నఃపితా॥
ఋ.1-90-7॥
భావం:- రాత్రి మధురం. ఉదయం మధురం. భూమి మధురం. తండ్రి అయిన అంతరిక్షం మధురం.
మధుమాన్నో వనస్పతిర్మధుమాన్ అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః॥
ఋ.1-90-8॥
ఇలా సృష్టి అంతా ఎందుకు మధురంగా ఉంది? అంటే ఋతానుచారి కావడం వలననే అని వేదం చాలచోట్ల పేర్కొంది. ఋతమంటె సరళం. సాధుశీలత మరియు నియమపాలన అని భావం.
ఇక ప్రస్తుత విషయానికి వద్దాం. మాట మధురమే గాదు అది సుమేధా అయి యుండాలని రుూ మంత్రం పేర్కొంది. అంటె మాట మధురమే కాదు అది హృదయ పూర్వకమై సద్బుద్ధితో పలుకునది కూడ కావాలని ఆ సుమేధా శబ్దానికి అంతరార్థం. సద్బుద్ధి పూర్వకం కాని మాట వల్ల ఏమి ప్రయోజనం? మాట సద్బుద్ధి ససితమైతే అది అప్రియమైనదైనా మాధుర్యవంతమవుతుంది. ఈ దృష్టితోనే మనుధర్మశాస్తక్రారుడు-
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియమ్‌॥
మను.్ధ.4-138॥
నిజం చెప్పు. కాని నిజాన్ని చేదుగా చెప్పకు’’ అని హెచ్చరించాడు. అంటె చేదు నిజాన్ని చెప్పకూడదంటె నోరు విప్పవద్దనియా? మనువు అభిప్రాయం? ఇలాంటి చిక్కు పెట్టటం ఆయన ఉద్దేశ్యం కాదు. అందుకే ఆయన ‘వౌనాత్ సత్యం విశిష్యతే’ (2-83) వౌనం కంటె సత్యం చెప్పడమే ఉత్తమమని నిర్ద్వంద్వంగా సలహా యిచ్చాడు. ఈ మాట ఆయన క్రింది ఋగ్వేద వచనానుసారం చెప్పిందే.
వదన్ బ్రహ్మా- వదతో వనీయాన్‌॥ ఋ.10-117-7॥
భావం:- వౌనం వహించిన జ్ఞాని కంటె వౌనం వీడిన వౌని మేలు. అంటె నిజం కఠినమైనదయినా వౌనం వీడి చెప్పమనే వేదాదేశం. అయితే సత్యం రుచికరం కాకపోవచ్చు. అయినా దానిని ప్రకటించడానికి బుద్ధిచాతుర్యాన్ని చూపాలి. ఈ కుశలతనే ప్రస్తుత మంత్రం-
‘యా తే జిహ్వా మధుమతీ సుమేధాః’ (ఋ.3-57-5)॥
సుబుద్ధితో సత్యాన్ని జోడించి అందరకు ప్రీతికరంగా చెప్పమని వివరించింది. మధురమైన ఈ వేదోపదేశాన్ని నీవు అందుకో. దానిని అందరకు అందించు.
**
42. వేదం సర్వజనాభ్యుదయకారిణి
యా తే అగ్నే పర్వతస్యేవ ధారా సశ్చంతీ పీపయద్దేవ చిత్రా
తామస్మభ్యం ప్రమతిం జాతవేదో వసో రాస్వ సుసమతిం విశ్వజన్యామ్‌॥
ఋ.3-57-6. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు