స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం- 62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
దానిననుసరించి వారు ఒక్కొక్క వేదమంత్రాన్ని గ్రహించి దానికి అనుగుణంగా ఈ విధంగాచేయి అని విధిని ఈ విధంగా చేయవద్దు అని నిషేధాన్ని అన్వయించి వివరిస్తారు. ఇదే సిద్ధాంతాన్ని గ్రహించి శే్వతాశ్వతరోపనిషత్ ఋషి ఈ భావానే్న ఈ మంత్రంలో వివరించాడు.
యో యోనిం యోని మధి తిష్ఠత్యేకో యస్మిన్నిదం సం చ వి చైతి సర్వమ్‌
తమీశానం వరదం దేవమీడ్యం నిచాయ్యేమాం శాంతిమత్యంతమేతి॥
॥ 4-11॥
ఎవడు మూల కారణాలపైన ఉత్పత్తి స్థానాలపైన ఒక్కడే తన అధికారాన్ని నిలిపి ఉంచాడో- ఎవని సంకల్ప వికల్పాలపై దృశ్యమాన జగత్తు సృష్టి- వినాశనాలను పొందుతూ ఉన్నదో అట్టి పరమేశ్వరుని సాక్షాత్కరింపచేసుకొన్నవాడు సంపూర్ణ శాంతిసౌఖ్యాన్ని పొందగలడు.
ఇట్టి శాంతి సౌఖ్యాన్ని ప్రతిజీవి అందుకొనేందుకు పరమేశ్వరుని తప్పక సాక్షాత్కరింపచేసుకోవాలి.
చీకటిని విడిచి వెలుగును కోరుకో
జ్యోతిర్వృణీత తమసో విజానన్నారే స్యామ దురితాదభీకే
ఇమా గిరః సోమపాః సోమవృద్ధ జుషస్వేంద్ర పురుతమస్య కారోః॥
ఋ.3-39-7.
ప్రతి పదార్థం:- విజానన్= జ్ఞానవంతుడు; తమసః= చీకటిని విడిచి; జ్యోతిః= కాంతిని; వృణీత= కోరుకోవాలి; వయమ్= మేము (అధ్యాహార్యం); దురితాత్= పాపం నుండి; అభీకే+ఆరే= మిక్కిలి దూరంగా; స్యామ= ఉంటాము; ఇంద్ర!= ఓ జ్ఞానయోగీ!; సోమపాః= ఓ సోమరసపానం చేసేవాడా! సోమలతా రక్షకుడా!; సోమవృద్ధ= సోమం చేత వృద్ధిపొందిన; కారోః= జ్ఞానప్రదాత యొక్క; ఇమాః= ఈ; గిరః= ఈ వేద వచనాలను; జుషస్వ= ప్రీతితో స్వీకరించి ఆచరించు.
భావం:- జ్ఞాని చీకటిని విడిచి వెలుగును కోరుకోవాలి. మేము పాపం నుండి దూరంగా ఉంటాం. ఓ సోమలతా రక్షకా! సోమరస పానశీలీ! జ్ఞానశ్రేష్ఠుని ఈ వేద వచనాలను సంప్రీతితో స్వీకరించి ఆచరించు.
వివరణ:- అంధకారం మృత్యువు. వెలుగు జీవితం. అందుకే వేదం ‘జ్యోతిర్వృణీత తమసో విజానన్’ చీకటిని విడిచి వెలుగును కోరుకోవాలి అని ఆదేశించింది. ఈ చీకటి- వెలుగుల మధ్యగల భేదాన్ని గుర్తించినవాడే చీకటిని విడిచి వెలుగును చూడగలుగుతాడు. మంత్రంలోని ‘విజానన్’ అన్న పదం ఈ భావానే్న సూచిస్తూంది. వెలుగును కోరుకో అన్న భావాన్ని వేదమనేక సందర్భాల్లో ప్రస్తావించింది. దీని కుదాహరణగా ‘ఉద్వయం తమసస్పరి స్వఃపశ్యంత ఉత్తరమ్’ (యజు.35-24) ‘‘చీకటిని విడిచి వెలుగును చూచెదముగాక’’ అన్న సంధ్యోపాసన మంత్రాల వంటి వెన్నింటినో గమనింపవచ్చు. అంతదాక ఎందుకు? ప్రస్తుత ఋగ్వేదమంత్రానికి తదుపరి మంత్రమైన ‘జ్యోతిర్యజ్ఞాయ రోదసీ అనుష్యాత్’ ఇహ- పర లోకాలలో యజ్ఞం కోసం వెలుగు వ్యాప్తమై ఉంది అన్నది కూడ పూర్వమంత్రార్థానే్న సమర్ధిస్తూ ఉంది.
వెలుగు అనగా జ్ఞానం. దాని ప్రయోజనం యజ్ఞమే. అవి ఒకదానికొకటి పరిపుష్టిని పొందేవే. వాని వలన పరమ కల్యాణం వ్యక్తికి- సమాజానికి సిద్ధిస్తుంది. ఈ జ్ఞానప్రకాశం వలన కలిగే ఫలమేమిటో ఈ మంత్రం రెండవ పాదంలో ‘‘ఆరేస్యామ దురితా దభీకే’’ మేము దుర్గతి= పాపం నుండి దూరం కావాలి అని పేర్కొంది. మరి దుర్గతి నుండి దూరంకావడమెలా? అంటే ఏది మంచో ఏది చెడో బాగా తెలిసినప్పుడే. ఆ ఎరుకయే అంటే వివేకమే మనిషికి చాలా ముఖ్యం. మనిషికి వివేక మెలా కలుగుతుంది? దానికి సదుపాయాన్ని కూడా ఈ మంత్రమే ‘ఇమాగిరః... కారోః’ సర్వోత్కృష్టుడై మహాజ్ఞాని చెప్పే వేద వచనాలను శ్రద్ధతో విని ఆచరించుమని సూచించింది.
ఈ విధంగా ఆచరించే బుద్ధిజీవులనే వేద మీ మంత్రంలో ‘సోమపాః’ అని పేర్కొంది.
*
ఇంకావుంది...