స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఎందుకంటె జ్ఞానుల పరమ లక్ష్యం బ్రహ్మజ్ఞానార్జన పైనే కదా. దీనికి తార్కాణంగా ఎందరో ఉపనిషత్ బ్రహ్మర్షులను దర్శించవచ్చు. అట్టివారిలో ముండకోపనిషత్ మహర్షి మాటలను వినండి.
తన మే వైకం జానథ మన్యా వాచో విముంచథామృత స్యైషసేతు
ఒక్క పరమాత్మనే తెలిసికో. లౌకిక విషయాలన్నింటిని విడిచిపెట్టు. ఎందుకంటే ఆయనయే అమృతత్వానికి సేతువు. ఆయనను ధ్యానించి సంసార జలనిధిని దాటు.
హృదయంలో వైశ్వానరాగ్ని ధారణ

వైశ్వానరం మనసాగ్నిం నిచాయ్య హవిష్మంతో అనుషత్యం స్వర్విదమ్
సుదానుం దేవం రథిరం వసూయవో గీర్భీ రణ్వం కుశికాసో హవామ్ హే!
భావం:బ్రహ్మనిష్టులమైన మేము శ్రద్ధ మరియు భక్తిరూప హవిస్సులచే సంపన్నులమై సత్యమైన ఆనందాన్ని కలిగించే సర్వజన శ్రేయోదాయకుడైన వైశ్వానరాగ్నిని మనస్సులో నింపుకొని గొప్ప దానశీలయు ఆత్మానంద ప్రదాయకుడూ మరియు సుందరుడూ అయిన భగవానుని సమస్త ఐషికాముష్మిక ధన మాయనయే యను భావనతో సన్నుతులను చేస్తూ కోరి ప్రార్థిస్తాము.
వివరణ:వసు శబ్దానికర్థం ధనమని. ఇది సామాన్యార్థం. కాని విశేషంగా అది భగవన్నామమే. ఎందుకంటే సర్వజీవులకు సమస్త జీవన ద్రవ్యాలను ఆయనయే అనుగ్రహిస్తాడు. అందుచే నిజమైన గొప్ప వసుః ధనం భగవానుడే. ఎవరికి భగవానుని ఎడల అనురక్తి ఉంటుందో వారిని ‘వసూయవః’ అని వేదం పేర్కొంది. ఏ వస్తువుమీదనైనా కేవలం అనురక్తి లేదా కోరిక మాత్రముంటే అది లభించదు. లభించాలంటే తగిన శ్రద్ధ, ఉత్సాహం, సాధనలు విధిగా అవసరం. వీనినే వేద పరిభాషలో హవిస్సు అంటారు. అంటే భగవంతుడే గొప్ప పెన్నిధి అనే భావనతో బాటు అతడు హవిస్సు కలిగినవాడై ఉండాలి.
భగవంతుడు గొప్ప వితరణశీలి. అందుకే ఆయనను వేదం ‘సుదానుః’ అని చెప్పింది. సమస్త ధనాలు సర్వజీవులకు ఆయన నుండియే లభిస్తాయి. దాని కొరకు ఆయనను సన్నుతిపూర్వకంగా గొంతెత్తి సంస్తుతించాలి. సన్నుతి మాటలతో చేయగలవు. కాని అవి మాటలుగానే ఉండరాదు. ఆ మాటలలో నీ హృదయం కూడా కలిసి యుండాలి. వేద మీ విషయానే్న ‘వైశ్వానరం మనసాగ్నిం నిచాయ్య’ ‘వైశ్వానరాగ్నిని మనస్సులో నింపుకోవలెననని జ్ఞాపకం చేసింది.
బృహచ్చ తద్దివ్యమచింత్యరూపం సూక్ష్మాచ్చ తత్ సూక్ష్మతరం విభాతి
దూరాత్ సుదూరే తదిహాంతికే చ పశ్యత్‌స్విహైవ నిహితం గుహాయామ్
న చక్షుషాగృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవైస్తపసా కర్మణా వా
జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్త్వ స్తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః
భావం:సర్వజీవ శ్రేయోదాయకమై వైశ్వానరాగ్ని రూపుడైన ఆ దైవం అన్నిటికన్నా పెద్దదాని కంటె పెద్దది. సూక్ష్మమైనది కూడా. దివ్యమైనది. బుద్ధికి అందనిది. అది ఎంత దూరమో అంత దగ్గర అయినది. దర్శించగలవారి హృదయగుహలో దాగి ఉంటుంది. చక్షు- జిహ్వాది జ్ఞానేంద్రియాల చేత గ్రహింపబడదు. తపస్సు- సత్కర్మల చేత తప్ప మరే సాధనంచేత తెలియబడదు. కేవలం జ్ఞానం చేత విమలమైన బుద్ధి కలిగి ధ్యానతత్పరుడైన ధ్యానయోగికి నిష్కళమైన ఆ అఖండ పరంజ్యోతి దర్శనవౌతుంది. ఆ దివ్యాత్మ కేవలం ధ్యానం చేత మాత్రమే గమ్యం. జ్ఞానంగాని- కర్మగాని ఆ దైవాన్ని సాన్నిధ్యం చేయలేవు. ఇక ఇతర సాధనాల గురించి చెప్పాలా? కాని ధ్యానం కర్మ మరియు జ్ఞానాలతో సంయుక్తమై పరిపుష్టమైనపుడు మాత్రమే ఆ జగన్నియామకుని దర్శనమవుతుంది. నేత్రాది ఇంద్రియాలు దూరంగా ఉండేవస్తువులను చూడగలవు. కాని పరమాత్మ వస్తువులవలె దూరంగా లేడు.

ఇంకావుంది...