స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మజ్ఞానమే సంసారతారకం
అగ్నిర్ధియా స చేతతి కేతుర్యజ్ఞస్య
పూర్వ్యః అర్థం హ్యాస్య తరణి

భావం:సర్వజనాభ్యుదయకారకుడై అగ్నిరూపమైన భగవంతుడు ధ్యానం చేత అందరికి జ్ఞానోదయం కలిగిస్తాడు. ఆయన ఈ సంసార (జన్మబంధన)మనే యజ్ఞానికి అనాదికాలం నుండి ఉన్నవాడు. ఆయనను పొందుట లేదా ఆయనకు చెందిన జ్ఞానాన్ని పొందుట ఖచ్చితంగా సంసార సాగరాన్ని దాటుటకు చేయు సాధనమే.
వివరణ: జనులు కొందరు భగవంతుడెలా ఉంటాడు? అని ప్రశ్నిస్తూ ఉంటారు. మరి తీపి ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పగలరా? చెప్పేందుకు ప్రయత్నించి ప్రయత్నించి తీపి ఎలా ఉంటుందో చెప్పలేక ప్రపంచమే ఓడిపోయింది. చివరకు ఏమంది? ఇదిగో ఈ తీపి పదార్థాన్ని తిను. రుచిగా నీకేది మనస్సుకు తెలిసిందో అదే తీపి అంతే అని చెప్పింది. ఈ విధంగా ఒక భౌతిక వస్తువునే వర్ణించి భాష చెప్పలేకపోతూంది. మరెన్నడూ చెప్పలేదు కూడా. మరి అందరు అడిగేది అభౌతికమైన బ్రహ్మపదార్థాన్ని గురించి ఎలా వర్ణించి చెప్పగలదు? కాబట్టి ఓ మనిషీ! నీవేమీ మాటాడకు. ఆ పరబ్రహ్మ పదార్థం మాటలకు (్భషలకు) వశపడేది కాదు. తెలియబడేది కాదు. చెప్పబడేది కాదు. ఆ బ్రహ్మతత్త్వం కేవలం ధ్యానం చేత మాత్రమే తెలియబడుతుంది. ‘అగ్నిర్ధియా స చేతతి’ అని ఈ మంత్రం దేవుడెలా ఉంటాడని వితండ ప్రశ్ననడిగేవారికి సూటిగా నోరు మూతపడే సమాధానం చెప్పింది.
మరి ధ్యానమంటే ఏమి? సాంఖ్య దర్శనం ‘్ధ్యనం నిర్విషయం మనః’- భౌతిక విషయాలనుండి విముక్తమైన మనఃస్తితియే ధ్యానమని నిర్వచించింది. కన్ను ముక్కు చెవి చర్మం జిహ్వ అనే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన జ్ఞానరహిత మానసిక దశయే ధ్యానమని భావం. నేత్రాది జ్ఞానేంద్రియాలను మూసి ఉంచు మనో నేత్రాన్ని తెరువు. అపుడు హృదయ గుహలో రహస్యంగా ఉండే మహా ప్రకాశాన్ని దర్శించు. అదే దైవం.
పైన చెప్పినట్లుగా మనస్సును జ్ఞానేంద్రియ జ్ఞానరహితం చేయడం అంత సులభం కాదు. చాలా కఠినం. అయినా అలా చేయక భగవద్దర్శనం కాదు. భగవద్దర్శనం కావాలంటే విషయ జ్ఞానం మనస్సులో ఉండరాదు. విషయ జ్ఞానం నిలిచియుంటే ఆ మనస్సులో దైవముండదు. మనస్సులో ఉండేది ఎవరో ఒకరే. కాబట్టి ధ్యానం ఒకరిమీదే గాని ఆ రెండింటిమీద నిలువదు. కారణం మనస్సుకు రెండింటిని ఒకేసారి తనలో నిలుపుకోగల శక్తి లేదు. అందుచేత ఆ రెండింటిలో దేనిపై నీకు ప్రీతి ఉందో దానినే ధ్యానం ద్వారా మనస్సులో నింపుకో. ఒకే సమయంలో రెండు పనులను చేయవద్దు. సాధారణ జనులు విషయజ్ఞానంతో మనస్సు నింపుకొంటె జ్ఞానులు మాత్రం ఆ భగవంతుని ఒక్కణ్ణే తమ మనస్సులో నిలుపుకొంటారు. ఎందుకంటె ఆ దైవమొక్కడే భగవసాగరం నుండి దాటింపగల సాధానం. అర్థం హ్యాస్య తరణిః- అన్న పై వేదర్షి వచనాన్ని సంపూర్ణంగా విశ్వసించినవారు కాబట్టి ఈ వేదోపదేశానే్న తలదాల్చి యమధర్మరాజు నచికేతుడితో-
యః సేతు రీజానానా మక్షరం బ్రహ్మ యత్పరమ్
అభయం తితీర్షతాం పారం నచికేత శకేమహి
శాశ్వతుడైన పరబ్రహ్మ ఉత్కృష్టుడు. ఆయనయే సంసార సాగరాన్ని దాటవలెననే కోరికగలవారికి భయరహితమైన వంతెన వంటి సాధనం. నచికేతుడు ఆర్జించిన బ్రహ్మజ్ఞానాన్ని మేమూ ఆర్జిస్తాము అని కఠోపనిషత్తులో అన్నమాట జ్ఞానులెవరైనా భావించేదే. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు