స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-55

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని సాధ్యం మాత్రంకాదు. అందుచేత లక్ష్యసాధనకై సాధన రూపమైన తమ ప్రయత్నాన్ని బుద్ధిమంతులు మనీషా= బుద్ధిబలంతో అనుసంధానించి దానిని బలవత్తరం చేస్తారు. బుద్ధిమంతుల ఈ లక్షణాన్ని వేదర్షి రుూ మంత్రంలో ‘పునంతి ధీరా అపసో మనీషా’అని వివరించాడు. ఇక్కడ బుద్ధిబలమంటే జ్ఞానమే. ఈ జ్ఞానానుసంధానం వలన కర్మాచరణలోగల దోషాలు లేదా లోపాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. ఈ అంశాన్ని భగవద్గీత ‘‘జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా’’ (గీత. 4-37) ‘జ్ఞానాగ్ని సర్వ కర్మలను భస్మం చేస్తుంది’అని ధృవీకరించింది.
బుద్ధిమంతులు తమ ప్రయత్నాలను జ్ఞాన పూర్వకంగా చేస్తారని ఈ మంత్రమే కాదు ఋగ్వేదం మరో మంత్రంలో ‘సాధన్పృతేన ధియం దధామి (ఋ.7-34-8) ‘నేను మనస్సున గల సత్యబుద్ధితో కర్మాచరణ రూపమైన సత్యశీలంతో బుద్ధిని అనుసంధానించి కర్మలనాచరిస్తాను’అని పునరుక్తిగా నొక్కి చెప్పింది. అంటె కర్మలను జ్ఞాన సంయుక్తమైన బుద్ధితో ఆచరిస్తానని భావం. ఈ విధంగా కర్మలను జ్ఞాన పూర్వకంగా చేసే వానిని విప్రుడని అంటారు.
ఈ వేదమంత్ర మిక్కడ ‘దేవయా విప్ర ఉదియర్తి వాచమ్’ విప్రుడు దివ్య ఆకాంక్షతో శుభవచనాలనే పలుకుతాడు అని చెప్పింది ఇదే. యజ్ఞంలో మానుషభాష మాటలాడరాదు. వైష్ణవి లేదా దైవీభాషనే మాట్లాడాలని బ్రాహ్మణ గ్రంథాలలో ఒక నియమం చెప్పబడింది. దీనికి యజ్ఞ సమయంలో దైవీ= పరమాత్మ భాషయయిన వేద భాషను గాని లేదా దైవీవాణి= శుభ భావనగల మాటలను గాని మాటలాడాలని అంతరార్థంగా గ్రహించాలి. మనుష్య జీవన సాఫల్యం ఎప్పటికైనా దివ్యత్వాన్ని పొందడంలోనే ఉంది. దివ్యుడు కాకుండ దైవవాణిని ఎలా పలుకగలడు? దివ్యుడు కావడానికి ప్రధాన సాధనం ఋత (సత్య) అనుష్ఠానమే. అసత్య త్యాగమే సత్యానుష్ఠానం. యజ్ఞారంభం చేసే సమయంలో యజమానుడు దీక్షను స్వీకరిస్తూ ఇదమహమనృతాత్ సత్యముపైమి (యజు.1-5) నేను అనృతాన్ని విడిచి ఋతాన్ని దీక్షగా వహిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక్కడ ఋతమంటే ‘యజ్ఞ’మని అర్థం. ఆ ప్రకారంగా యజ్ఞ విరుద్ధమైన భావాలను నేను విడిచిపెడుతున్నానని యజమాని ప్రతిజ్ఞగా గ్రహించాలి. ఈ విషయం వేదాలలో మరియు బ్రాహ్మణ గ్రంథాలలో దివ్యులు యజ్ఞంచేస్తారని పలుమార్లు చెప్పబడింది. మరో విషయమేమంటే శతపథ బ్రాహ్మణంలో ‘ఇదమహమనృతాత్ సత్యముపైమి’అన్న మంత్రానికి అర్థం. ఈ మంత్రార్థానుసారం అనుష్ఠానం చేసిన యజమాని ‘‘మనుష్యేభ్యో దేవానుపైతి’’ మానవులందరికంటె ఉన్నతమైన దేవత్వసిద్ధిని పొందుతాడు అని వ్రాయబడింది. అక్కడే సత్యం వైదేవా అనృతం మనుష్యాః’ మనుష్యులు అసత్యవాదులై దివ్యులు సత్యస్వరూపులై యుంటారని కూడ చెప్పబడింది. సాధారణంగా మానవులు అనృత= ఋతము కాని యజ్ఞ్భిన్నమైన కర్మలను లేదా అనృత= అసత్యయుతమైన కర్మలను పలుమార్లుచేస్తూ ఉంటారు. కాని దేవతల ఆచరణలో అనృత= అసత్యమైనది లవలేశం కూడ ఉండదు. వారి జీవనంలో సత్యం పడుగుపేకలుగా కలిసిపోయి యుంటుంది. మానవ జీవన ప్రధాన లక్ష్యం దివ్యజీవనమే. దానిని సాధించేందుకు మానవుడు అసత్య త్యాగం. సత్యగ్రహణం, సత్యశీలం కలిగి యుండటం అనివార్యం. అది వినా దివ్యత్వం మానవుడికి అసంభవం. *** ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు