స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీత కూడా-
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః
‘‘ప్రాణులన్ని నిద్రించే సమయంలో సంయమీంద్రులు మేల్కొని యుంటారు. సంయమివరులు నిద్రించే సమయంలో ప్రాణులు నిద్రిస్తాయి’’ అని ఇదే విషయాన్ని సమర్థించింది.
సామాన్య జనులు భోగానుభవంనుండి బయటపడలేరు. వారి జీవితమంతా ఆహార పానీయాది సామగ్రిని సమకూర్చుటయందే గడిచిపోతుంది. కాని ఎవరీ శరీరాన్ని ఇచ్చాడో అతడే దీనిని రక్షణ చేసే సామగ్రిని కూడా తప్పక ఇస్తాడని జ్ఞానికి మాత్రమే తెలిసియుంటుంది. అతనిని ఈ జన్మలోనే తప్ప మరో జన్మలో పొందడం మాత్రమే సాధ్యపడదు. ఈ సందర్భంలో యమ - నచికేతుల మధ్య జరిగిన సంభాషణ గుర్తింపవలసియుంటుంది. యముడు నచికేతునికి అనేక భోగవస్తువులను ప్రస్తావించి వాని నన్నింటినీ నీవు తీసుకో. కాని ఆత్మ తత్త్వాన్ని మాత్రమడగవద్దు అన్నాడు. అప్పుడు నచికేతుడు మార్మికంగా సమాధాన మీ విధంగా ఇచ్చాడు.
శ్వోభావా మర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః
అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్యగీతే
న విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా
జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయః స ఏవ
ఓ యమధర్మరాజా! నీవు నాకిప్పుడీయదలచినవి నేడుంటాయి. రేపు మాత్రముండవు. అంతేకాక అవి నా ఇంద్రియ శక్తులన్నింటిని హరించి వేస్తాయి. ఆచంద్ర తారార్కంగా ఆయుష్షు లభించినా అది అనంతకాల పరిమాణంలో స్వల్పమే. నృత్య- గానాది సామగ్రిని నీ వద్దనే ఉంచుకో. ధనంతో ఎవరికి తృప్తిలభించదు. నిజంగా ఆత్మతత్త్వ సంబంధియైన జ్ఞానమే ప్రాప్తిస్తే ధనం లభించినట్లే. భోగాలెంత పరిమితమో అంతకాలమే జీవిస్తాము. ఆత్మతత్త్వ జ్ఞానం లభించే వరాన్ని మాత్రమే సమవర్తీ! దయతో నిమ్ము.
జాగరణశీలం కలవాడు ఇతరులకు బోధింపగల సమర్థుడయినచో వారిని జ్ఞానులను చేయగలడు.

33. మనిషి జన్మ జీవన సమరాన్ని ఎదుర్కొనేందుకే
జాతో జాయతే సుదినత్వే అహ్నం సమర్య ఆ విధథే వర్ధమానః
పునంతి ధీరా అపసో మనీషా దేవయా విప్ర ఉదియర్తి వాచమ్‌॥ ఋ.3-8-5.
ప్రతిపదార్థం:- జాతః= శరీర ధారియైన మానవుడు; అహ్నామ్= దినాలను; సుదినత్వే= శుభ దినాలుగా చేసుకొనుటకై; జాయతే= జన్మిస్తాడు; స= అతడు (అధ్యాహార్యం); సమర్యే= జీవన సమరాన్ని ఎదుర్కొనుటకు; విదథే= జీవిత ప్రధాన లక్ష్యాన్ని సాధించేందుకు; ఆ= అన్ని విధాలుగా; వర్ధమానః= దినదినాభివృద్ధిని చెందుతాడు; ధీరాః= దైవ ధ్యానపరులు; మనీషా= తమ బుద్ధిచేత; అపసః= కర్మలను; పునంతి= పవిత్రీకరిస్తారు; దేవయా= దివ్య ఆకాంక్షతో; వాచమ్= శుభ వచనాలను; ఉత్+ఇయర్తి= పలుకుతాడు;
భావం:- దినాలన్ని ఒకే రీతిగా ఉంటాయి. వానిని తనకు శుభదినాలుగా చేసుకొనేందుకే మనిషి జన్మనెత్తుతాడు. జీవితమే ఒక సమరం. దాని నెదుర్కొనేందుకే క్రమంగా ఎదుగుతాడు. ప్రతి జీవితానికి ఒక లక్ష్యముంటుంది. దానిని సాధించేందుకే ప్రయత్నిస్తాడు. దైవధ్యాన తత్పరులు తమ బుద్ధిచేతను, మేధావియైన బ్రాహ్మణుడు దివ్య ఆకాంక్ష తోడను శుభ వచనాలను పలుకుతారు.
వివరణ:- మంత్రంలోని ప్రథమ వాక్యం మానవ జీవన ప్రయోజనాన్ని సుందరమైన ఆలంకారిక కావ్య భాషలో వర్ణించింది. నిత్యమూ సహజంగా సంభవించే దినాలను శుభదినాలుగా- ఆనందమయంగా తీర్చిదిద్దుకొనేందుకే భగవంతుడు మానవుడికి జన్మనిచ్చాడు. పశుపక్ష్యాదులకు దైవాన్ని ఆరాధించే అవకాశమే లేదు. అందుచేత అవి తమ జన్మను సార్థకం చేసుకోలేవు. తమ దినాలను శుభదినాలుగా దిద్దుకోలేవు. అవి కేవలం పశుపక్ష్యాదులుగానే మరణిస్తాయి. కాని జీవులకు ఉత్తమమైన మానవజన్మ లభిస్తే తమ ఉన్నతికి తగిన సాధనం లభించినట్లే. అప్పుడు కూడ జీవిత సార్థక్యానికి ప్రయత్నించకుంటె మరెప్పుడు ప్రయత్నం చేస్తారు?
చిత్రమేమంటె ఈ మానవ జీవితం ఆషామాషీ అయినది కాదు. ఎందరితోనో ఎన్నింటితోనో తలపడి యుద్ధం చేయవలసి యుంటుంది. జీవన సమరం చేయకుండా జీవనం సుజీవనం కాదు. దినం సుదినం కాదు. ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు