స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంద్ర తారార్కంగా ఆయుష్షు లభించినా అది అనంతకాల పరిమాణంలో స్వల్పమే. నృత్య- గానాది సామగ్రిని నీ వద్దనే ఉంచుకో. ధనంతో ఎవరికి తృప్తిలభించదు. నిజంగా ఆత్మతత్త్వ సంబంధియైన జ్ఞానమే ప్రాప్తిస్తే ధనం లభించినట్లే. భోగాలెంత పరిమితమో అంతకాలమే జీవిస్తాము. ఆత్మతత్త్వ జ్ఞానం లభించే వరాన్ని మాత్రమే సమవర్తీ! దయతో నిమ్ము.
జాగరణశీలం కలవాడు ఇతరులకు బోధింపగల సమర్థుడయినచో వారిని జ్ఞానులను చేయగలడు.
జాగరూకులే నిన్ను జాగృతి పరుస్తారు
తం త్వా విప్రా విపన్యవో జాగృవాంసః సమింధతే
హవ్యవాహా మమర్త్యం సహోవృధమ్
భావం:ఓ మానవుడా! నీకు సమస్త భోగ ద్రవ్యాలను సమకూర్చి, సర్వశక్తులను అభివృద్ధిపరచే శాశ్వతుడగు భగవంతుని సన్నుతి క్రియలో కుశలురు మరియు జ్ఞానస్థితిలో వుండే మేధావులైన విద్వాంసులు నిన్ను బాగా మేల్కొల్పగలరు.
వివరణ:్భగవంతుని ఎట్లో ఎవరైనా దర్శించగలరు. కాని వారు ఆయనను అందరకు దర్శింపజేయలేరు. అంతేకాదు, ఇతరులలో భగవద్భక్తిని జనింపజేయలేరు. లోకంలో ఎందరో పట్ట్భద్రులు కావచ్చు. వారందరు ఇతరులను పట్ట్భద్రులను చేయగలరా?
భగవంతుని ఎడల భక్తినెందుకు కలిగియుండాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనంతవరకు ఇతరులలో భగవద్భక్తిని ఎవరూ కలిగింపలేరు. లోకంలో మనుష్యుల ఆలోచనలన్ని పొట్టనింపుకొనే పని చుట్టూనే తిరుగుతూ వుంటాయి. అంతమాత్రమే కాదు, సుఖజీవనం కోసం అనేక ద్రవ్యాలను, వస్తువులను కూడబెట్టాలనే వాంఛ కూడా మనుషుల్లో అధికం. కాని అట్టి వస్తుజాలాన్ని ఎవరో ఒకరిద్దరు తప్ప అందరు సంపూర్ణంగా సమకూర్చుకోలేరు. దానికి మనుషులలో చింత ప్రారంభమవుతుంది! ఆ చింత ఏల? ఓ మానవుడా! సృష్టిలోని సర్వ పదార్థాలకు ప్రభువు ఒకడున్నాడు. ఆయన ఎవరికెంత ఈయదలచాడో అంతా ఎక్కువ తక్కువలు లేకుండా సమబుద్ధితో సమకూరుస్తూ ఉంటాడు. అట్టి సమదర్శి భగవంతునే హవ్య వాహనుడని వేదం పై మంత్రంలో వ్యవహరించింది.
లోకంలో చాలామంది ‘మేము కర్మలను చేసాం. దానికి ఆయన ఫలమిచ్చాడు. ఇందులో ఆయనుపకారమేముంది? ఇది దేవుడికి మాకు మధ్యగల వట్టి వ్యాపారమే కదా?’ అని కుతర్కం చేస్తారు. ఇట్టి అజ్ఞానులు భగవంతుని మార్మికత్వమెట్టితో గ్రహించనివారు. అట్టివారు నీకెదురుపడినపుడు ‘ఆ పరమాత్మ కర్మఫలానే్న ఈయకుంటే ఏమి చేయగలవు? అసలు కర్మఫలాన్ని ఈయడం ఆయన కరుణ మరియు మహోపకారమే’. ఓరీ అమాయకుడా! నీవాయనకు ఇస్తున్నది లేదు. నీ వద్దనుండి ఆయన తీసుకొంటున్నది లేదు. నీవిచ్చినదానికి ఆయనేదేని ఇస్తే అది వ్యాపారమవుతుంది. కాని ఆయనకిచ్చేందుకు అసలు నీ దగ్గరేముంది? ఒకవేళ ఏదేని నీ వద్ద ఉంటే అది నీకాయన ఇచ్చిందే అని ప్రశ్నించి చూడు.
లోకంలో భోగాలనుభవించాలనుకొంటే దానికి తగిన ప్రయత్నం చేయాలి. దానికి తగిన శారీరక, మానసిక బలం కావాలి. ఆ బలాన్ని వృద్ధి చేసేవాడు కూడా ఆ పరమాత్ముడే. అందుకే పై మంత్రంలో ఆయనను సహోవృధమ్ బలాన్ని వృద్ధిచేసేవాడని శ్లాఘించింది. ఇదేవిధంగా యజుర్వేం కూడా ‘య - ఆత్మదా బలదా’ ఆత్మానుభూతిని మరియు శరీర బలాన్ని ఇచ్చేవాడు ఆయనయే అని ఆ భగవంతుని ప్రశంసించింది. ఈ భావాన్ని విపులంగా వివరిస్తూ ఒక ప్రార్థనా మంత్రం అథర్వణ వేదంలో ఇలా కనబడుతూంది.
ఓజో - స్యోజోమే దాః స్వాహా సహో - సి సహో మే దాః స్వాహా
బలమసి బలం మే దాః స్వాహా
భావం:ఓ ప్రభూ! నీవు ఓజోవంతుడవు. నాకు ఓజస్సు నిమ్ము. సర్వబలాలకు మూలము నీవే. నాకు బలమిమ్ము. నేను హృదయపూర్వకంగా సత్యమే చెబుతున్నాను. నా దృఢత్వానికి, బలానికి నీవే ఆధారం. నాకు బలమిమ్ము.
భోగాలు - భోగసాధనాలు మరియు బలానికి నిలయమైన భగవంతుని జాగృతి పరచకుంటే మనమేమి పొందగలం? లోకమెప్పుడు నిద్రిస్తూ వుంటుంది. నిద్రించేవాడు ఎవరినైనా ఎప్పుడైనా జాగృతపరచగలడా? జ్యోతి స్వరూపుడైన పరమాత్మ జాగరూకుడు మాత్రమే మేల్కొల్పగలడు. ‘జాగృవాంసః సమింధతే’ అని రుూ మంత్రం చెప్పింది ఇదే. దీనినే ఋగ్వేదం మరియు కఠోపనిషత్తు.
‘దివేదివ ఈడ్యో జాగృవద్భిః’ జాగరూకులే ప్రతిదినం పరబ్రహ్మను ఆరాధిస్తారు.
ఉత్తిష్ఠత! జాగృత- తెమ్ము జాగరూకుడవు కమ్ము అని ప్రబోధించాయి. ఇంకావుంది.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు