స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
*

బహు సంతానవంతుడు బహు దుఃఖభాజనుడే
య ఈం చకార న సో అస్య వేద య ఈం దదర్శ హిరుగిన్ను తస్మాత్
స మాతుర్యోనా పరివీతో అంతర్బహుప్రజానిర్బతిమా వివేశ ఋ. 1-164-32
భావం: ఎవడు ఆత్మ రహస్యాన్ని తెలుసుకోలేక కర్మల ఆచరిస్తాడో అతడు జనన మరణరూపమైన సంసార బంధనంలోకి మరల మరల వస్తాడు. ఎవడు ఆత్మజ్ఞానాన్ని దర్శిస్తాడో అతడు ఆత్మజ్ఞానం తెలియని వానికంటె భిన్నమైనవాడు ఎవడు ఆత్మజ్ఞానాన్ని దర్శిస్తాడో అతడు ఆత్మజ్ఞానం తెలిని వానికంటే భిన్నమైనవాడు. ఎందుకంటే అతడు తల్లియొక్క గర్భంలో తాను చిక్కుకుని పోయిన వానిగా గ్రహించగలుగుతాడు. బహు సంతానం కలవాడు తప్పక దుఃఖభాజనుడవుతాడు.
ఆవశ్యం గోపా మనివద్యమాన చ పరాచ పథభిశ్చరంతమ్
ససధ్రీచీః స విషూబీర్వసాన ఆవరీవర్తి భువనేష్వంతః
ఈ మంత్రంపై ప్రస్తుత మంత్రానికి పూర్వానిది. దానిలో ఆత్మ స్వరూపం నిరూపించబడింది. అందులో మంచి చెడు మార్గాలలో నడచేవాడు జీవితంలో మంచి- చెడు దశలను అనుభవిస్తాడని ప్రస్తావించబడింది. అంటే అతడు జనన మరణ రూపమైన సంసార చక్రభ్రమణంలో పలుమార్లు చిక్కుకొంటారని భావం.
జీవుల ఇట్టి స్థితిని సంకేతిస్తూ య ఈం చకార న సో అస్య వేద - ఎవడట్టిపనిని చేస్తాడో అతడు ఆత్మ రహస్యం తెలుసుకోలేడు అని నిర్ధారించింది. లోకంలో అత్యధికులు ఇట్టి పనినే అంటే ఆత్మ రహస్యం తెలుపబడనట్టి పనులనే చేస్తూ ఉంటారు. కనుక జనన మరణ బంధన రూపమైన సంసార చక్రంలో తప్పక చిక్కుకుని పోతుంటారు. ఇట్టివారి కర్మలే దుష్కర్మలు. వీరికి భిన్నంగా మరికొందరు సత్కర్మల నాచరిస్తూనే ఉంటారు. అయినా ఇవి మోక్ష సాధన సమర్థమైనట్టివి మాత్రం కావు. వీని ఆచరించనవారు కూడా వెనుక చెప్పిన దుష్కర్మల సమర్థమైనట్టివి మాత్రం కావు. వీని ఆచరింనవారి వలె సంసార చక్రబంధనంలోనే తగులుకొంటారు. కారణమవి భోగసాధకాలు కనుక కాకపోతే ఈ ఇరువురకు భేదమేమంటే చేసే కర్మల ఫలప్రదాయకత్వాన్ని గ్రహించి వీరు దుష్కర్మాచరణకు దూరంగా ఉంటూ స మాతుర్యోనా పరివీతో-తః ‘అన్ని విధాల మాతృగర్భంలో చిక్కు పడేవారు’ గా స్పృహ కలిగి ఉంటారు. ఎలా అంటే తాము చేసిన కర్మలకు ప్రతిఫలం భోగ ప్రదానమనే కర్మఫలసిద్ధాంతం బాగా తెలిసిన వారు కావడం చేతనే. ఈవిధంగా కర్మఫలం తెలిసి కొందరు, తెలియక కొందరు జననమరణ చక్రంలో ఇరుక్కుని పోయే లౌకిక జనుల దీనదశను వర్ణించిన వేదం బహు ప్రజా నిర్బతి మా వివేక .. బహు సంతానవంతుడు దుఃఖాన్ని పొందుతాడు. అన్న ఒక గొప్ప సామాజిక న్యాయసూత్రాన్ని ఆవిష్కరింపచేస్తుంది. సామాజికంగా స్థూలదృష్టితో చూస్తే ఈ మాట విశ్వంలోని సమస్త మానవాళి వర్తించే న్యాయ సూత్రం. ఈ సూత్రాన్ని సమస్త మానవాళి పాక్షికం గుర్తించే విధిగా ఆచరిస్తుంది.
ఇక ఈ సూత్రాన్ని ఆధ్యాత్మిక కోణంలో పరిశీలించినా ఈ సామాజిక న్యాయమే సత్యమని సిద్ధమవుతుంది.
దంపతులకు పర్యాయవాచకం జాయాపతి అన్న పదమొకటి కనబడుతుంది. ఇందులోని జాయా శబ్దానికి వేద నిఘంటువు కర్త వివరణ చెబుతూ పుత్రునీ రూపంగా పతియే తన జాయ యందు (్భర్య యందు) జనిస్తున్నారు. ఈ విధంగా జనింపచేస్తున్నది. కనకు ఆమె జాయ అవుతున్నది అని వివరించాడు. ఆత్మా వైపుత్ర నామాసి పురుషుని ఆత్మయే పుత్రుని రూపంగా జాయయందు జనిస్తున్నదన్న వేద వచనం కూడా దీనినే సమర్థిస్తూంది. మనుస్మృతి కూడ ఆ జాయ శబ్దానికి అర్థం చెబుతూ
పతిర్భార్యాం సంప్రవిశ్య గర్భో భూత్వేహ జాయతే
జాయాయా స్తద్ధి జాయాత్వం యదస్యాం జాయతే పునః
భర్తయే భార్య గర్భంలో ప్రవేశించి తానే జన్మ నెత్తుతున్నాడు. ఈ రీతిగా తన భార్య యందే జన్మిస్తున్నందువల్ల ఆమె జాయ అనబడుతుంది.దీనిని బట్టి పురుషుడుగా ఉన్న జీవాత్మయే కుమారుడిగా జన్మిస్తున్నదని స్పష్టపడుతూంది. మరి ఒక పురుషుడు అధిక సంతానాన్ని పొందితే ఆ రూపాల్లో సుఖ దుఃఖాలననుభవించేది ఆ ప్రథమ పురుషుడే కదా. కాబట్టి అధిక సంతానాన్ని పొందటం ద్వారా సంతార రూపంగా లోకంలో సుఖం కంటే దుఃఖాన్ని అనుభవించేవాడు అధిక సంతానవంతుడు అగు జీవాత్మయే. లేదా అధికసంతానం పొందే దుఃఖాన్ని చూసి దుఃఖాన్ని పొందేవాడు కూడా అతడే. కాబట్టి ఏ విధంగా చూసినా అధిక సంతానవంతుడు బహుదుఃఖనాజనుడే తస్మాత్ జాగ్రత్త. ఇంతేకాక భౌతిక ప్రపంచంలో కూడా బహు సంతానవంతుడు ఎన్నో విధాలుగా దుఃఖబాజనుడే అవుతాడు కదా.