స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు ఉత్తమ రచన చేసాడు
ఉప హ్వయే సుదుఘాం ధేనుమేతాం
సుహస్తోగోధుగుత దోహదేనామ్
శ్రేష్ఠం సవం సవితా సావిషన్నో-
భీద్ధో ఘర్మస్తదు షుప్ర వోచమ్
భావం: ఉత్తమమైన పాలను సులభంగా ఇచ్చే ఈ ధేనువునకు దగ్గరగా ఉండాలని కోరుకొంటున్నాను. చేతులయందు నేర్పరితనం గలవాడే ఆ ఆవును పిండగలడు. తేజస్స్వరూపుడైన పరమాత్మ మా కొరకు ఉత్తమ లోకాలను ఉపదేశాలను కల్పించగలడు.
వివరణ: ఈ మంత్రంలో చెప్పబడిన ఆవు కేవలం పాలనిచ్చే ఆవు మాత్రం కాదు. అది సృష్టి అంతా నిండియున్న ప్రకృతికి ప్రతీక. ఈ ప్రకృతి చేతనే సర్వేశ్వరుడు జగత్తును బహు సుందరంగా తీర్చిదిద్దాడు. ప్రకృతి రచనలోని సౌందర్య నిర్మాణం చేతనే మానవుడు ఆనందాల ననుభవిస్తున్నాడు. ఉదాహరణకు మానవ శరీర నిర్మాణానే్న పరిశీలించండి. కళ్లు సరిగా ముక్కుకు పైననే ఉంచబడ్డాయి. అలా కాక ముక్కుకు క్రింద ఉంచబడితే? దానినుండి స్రవించే మలిన స్రావాల చేత ఏమి జరిగేదో మీరూహించగలరు కదా. అలాగే నోరు నిర్మాణం చూడండి, సరిగ్గా ముక్కునకు క్రిందే అమర్చబడింది. దానివలన నోటి ద్వారా లోనికిపోయే పదార్థం సువాసనలను, దుర్వాసనలను గ్రహించి వానిని స్వీకరించడమో విసర్జించడమో సాధ్యపడుతూంది. దీనిని బట్టి వివిధ అవయవాల అమరిక వాని పనితీరుకు అనుగుణంగా నైపుణ్యంగా నిర్మాణం చేయబడినట్లు స్పష్టపడుతుంది. దీనిని బట్టి సర్వసృష్టిని ఇలా యథాస్థానంలో యథాయోగ్యంగా ఉంచి నిర్మాణం చేసిన పరమేశ్వరుని కౌశల్యం స్పష్టపడుతుంది. భగవానుని కౌశల్యభరితమైన ఈ ప్రకృతి లేదా ఈ జగత్తే ధేనువు అని, అది మానవులకే కాదు సర్వజీవులకు ‘సుదుఘా’ సులభంగ ఆ పాలను = భోగాలను ధారలుగా కురిపించేదని వేదం వివరించింది.
ఈ విధంగా భోగాలను ధారలుగా కురిపించేది కావడం చేతనే జీవుడు ‘పహ్వయే సుదుఘూం ధేనుమేతామ్’ నేను ఆ ఆవు వద్దనే ఉంటాను అని అనుకుంటాడు అంత మాత్రం చేత జీవుడికి తలచిన కార్యం సిద్ధిస్తుందా? ఆ ఆవు స్తనాలలో పాలున్నాయి. కాని ప్రతి వ్యక్తి ఆ పాలను పిండుకోలేడు. అంటే ప్రకృతి అంతటా జీవుల కవసరమైన భోగముంది. ఎవడో ‘సుహస్తః’ నిపుణతగల చేతులు గలవాడే ఆ ప్రకృతి రూపధేనువు నుండి భోగరూపమైన పాలు పిండుకోగలడు. అంటే అనుభవింపగలడు. ఈ భావానే్న సూటిగా సకల పదారథ్ హైఁ జగ్ మాహీమ్. కర్మహీన నర్ పావత్ నాహిమ్ ఈ భూమిపై పదార్థాలన్నీ ఉన్నాయి. కాని కర్మహీనుడు వానిని పొందజాలడు అనే హిందీ సామెత ప్రకటిస్తూంది. ఇట్టిదే మరొక సామెత హిందీలో ఇలా కనిపిస్తూంది. సకల పదారథ్ హైఁ ఇహి మాహీం. హస్త హీన నర పావత నాహిం- ఈ లోకంలో సకల పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. కాని చేతులు లేనివాడు వానిని పొందలేడు. హిందీ సామెత చేతులు లేనివాడు లోకంలో పదార్థాలను పొందలేడని చెప్పినా ఋగ్వేదం చిత్రంగా చేతులున్నా కూడా ప్రకృతి ధేనువు నుండి భోగక్షీరాలను పొందలేడని ‘సవౌచిద్ధస్తౌ న సమం వివిష్టః’ - చేతులు రెండూ సమానంగా వున్నా అవి పనులను సమానంగా చేయజాలవు అని ఒకే హేతువును ప్రతిపాదించాయి. నిజమే కదా! చేతులు అందరికీ సమానంగా వున్నా శక్తి అందరికీ ఒకే విధంగా ఉండదు కదా! ఇంకాఉంది