స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకుగల చైతన్యశక్తి సహజసిద్ధమైనది కాదు. అందు మరియొక మహాచైతన్యశక్తినుండి ప్రసారితమై వస్తున్నది అని భావం.
మరి వేదమీవిధంగా చెప్పడంలో ఆంతర్యం ఆత్మకంటే ఉన్నతమైన పరమ ఆత్మను అనే్వషించు. అదే దృత్యమానమయ్యే సర్వచైతన్యాలను చైతన్యపరచే పరమచైతన్యం. మానవుడా! దానినే ఆశ్రయించుమని అర్థం.
***
ప్రజాపతి అజన్ముడు
ప్రజాపతిశ్చరతి గర్భే- అంతర జాయమానో బహుధా విజాయతే
తస్య యోనిం పరి పశ్యంతి ధీరాస్తస్మిన్‌హ తస్థుర్భువనాని విశ్వా॥ ॥
భావం:- సమస్త సృష్టి పరిపాలకుడైన సర్వేశ్వరుడు ప్రకృతికి లేదా సృష్టికి గర్భంలో ఉన్నాడు. జననం లేనివాడై ఆయన అనేక విధాలుగా ప్రకటితమవుతున్నాడు. ధ్యానంలో యోగులు ఆయన నివాసాన్ని దర్శిస్తున్నారు. సర్వలోకాలు ఆయనలోనే ఉన్నాయి.
వివరణ:- సకల భువనోత్పాదకుడైన భగవంతుడెక్కడున్నాడు? దీనికి సమాధానంగా కొందరు ఒకచోట, మరికొందరు మరియొకచోట అని అనేక విధాలుగా చెబుతూ ఉంటారు. కాని వేదం మాత్రం ‘ప్రజాపతిశ్చరతిగర్భే అంతః’ ‘‘ప్రజాపతిప్రకృతికి- సృష్టిగర్భంలో ఉన్నాడు’’అని చెబుతూంది. అయితే గర్భాదులలో ఉన్నాడు కావున ఆ ప్రజాపతి ఏదో ఒకనాడు జన్మిస్తాడని భ్రాంతి చెందరాదు. ఎందుకంటే వేదమా ప్రజాపతిని ‘అజాయమానః’ ‘‘జననం పొందనివాడు’’అని అంటూంది. అయితే ఆయన ఉన్నట్లుగా మనకెలా తెలుస్తుంది? అన్న ప్రశ్నకు వేదం ‘బహుధా వి జాయతే’ అనేక విధాలుగా అందరకు ప్రకటితమవుతాడు ’’అని ఆయన నానాప్రకారత్వాన్ని చాటుతూంది. అంటే నిత్యనూతన సృష్టి, నిత్య సంహార ప్రక్రియ, నిత్యపాలన, విచిత్ర రీతులుగా సంరక్షణద్వారా పరమేశ్వరుడు ప్రకటితమవుతున్నాడని భావం.
‘మనస్సునకు హత్తుకోని ఈ గందరగోళ సమాధానంగాక ఆయన సూటిగా ఎక్కడున్నాడో చెప్పండి’అని అడిగే వానినుద్దేశించి వేదం ‘తన్య యోనింపరిపశ్యంతి దీరాః’ ‘యోగులు ధ్యానంలో ఆ పరమాత్ముని నిత్యనివాసాన్ని అంతట దర్శిస్తున్నారు’’అని సమాధానమిస్తూంది. అంటే చక్షుః శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణ, చర్మేంద్రియాలు ఆ దైవాన్ని దర్శించజాలవు. కేవలమాయన ధ్యానమందు మాత్రమే గోచరమవుతాడని అంతరార్థం. ఆ భగవానుడు కేవలమేదో ఒక ప్రదేశంలోగాక సర్వత్ర దర్శనమిస్తాడని-
ఆప్రా ద్యావాపృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ॥

‘స్థావర-జంగమాలకు ఆత్మ అయినవాడు, సమస్త్యానికి సర్వులకు చైతన్యప్రదాయకుడు అయిన పరమాత్మ ముల్లోకాలలో అంతట వ్యాపించియున్నాడు’’అని సంధ్యావందన మంత్రాలలో మరింత స్పష్టంగా చెప్పబడ్డాడు. అంతేకాదు ‘తస్విన్‌హ తస్థుర్భువాని విశ్వా’ సకల భువనాలు ఆయన అందే గర్భీకృతమైయున్నాయని వేదం విశేషంగా వచించింది. శుక్లయజుర్వేదమీ విషయాన్ని బహుసుందరంగా ఇలా వివరించింది.
ఏషో హ దేవః ప్రదిశో-ను సర్వాః పూర్వో హ జాతః స ఉ గర్భే అంత.॥
స ఏవ జాతః స జనిష్యమాణః ప్రత్యజ్ జనాస్తిష్ఠతి సర్వతోముఖః॥
(శు.య.వే.32-4)
‘‘సర్వేశ్వరుడు సర్వదిశలలో- సర్వవిదశలలో(మూలలలో) విరాజమానుడై యున్నాడు. ఆయన అందరికంటె ముందే ఉన్నాడు. సమస్త రహస్య ప్రదేశాలలో ఉన్మాడు. ఆయన ప్రసిద్ధుడై ఉన్నాడు-ఉంటున్నాడు- ఉండబోతున్నాడు. ఆయన సర్వతోముఖుడు అంటే ఆ సర్వాత్మకుడు లేని స్థలంగాని కాలంగాని లేనేలేదు’’. అందుచేతనే ఆ సర్వభూతాంతరాత్ముని ఎక్కడని చూడగలం? కేవలం ఆయన ధ్యానగమ్యుడు మాత్రమే. అట్టివాని సందర్శనకోసం ఏ లోకాలను తిరుగగలం? ధ్యాన నిష్ఠలమై దర్శిద్దాం. రండి.
**
దైవానికి ఎనె్నన్ని నామాలో
తదేవాగ్నిస్త దాది త్యస్తద్వాయుస్తదు చంద్రమాః
తదేవ శుక్రం తద్ బ్రహ్మతా-అపః స ప్రజాపతిః
॥ శు.య.వే.32-1॥
భావం:- ఆయనయే అగ్ని, సూర్యుడు, వాయువు, చంద్రుడు, శుక్రుడు, బ్రహ్మ, జలం మరియు ప్రజాపతి.
వివరణ:- అథర్వణవేదం భగవంతుణ్ణి ‘పురుణామానమ్’ (అథ. 6-9901) అనేక నామాలుకలవాడని శ్లాఘించింది.

- ఇంకావుంది...

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512