స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైవం జీవులకు
కర్మానుగుణంగానే దేహాన్ని ఇస్తుంది
ఆ యో ధర్మాణి ప్రథమః ససాద తతో వపూంషి కృణుషే పురూణి
ధాస్యుర్యోనిం ప్రథమ ఆ వివేశా యో వాచమనుదితాం చికేత॥ ॥
భావం:- సర్వేశ్వరుడు ముందుగా జీవులకు ధర్మాలను- కర్తవ్యాలను సృజించి తదుపరి అనేక జీవరూపాలను సృష్టించాడు. ఆ సర్వేశ్వరుడే విధాతయై మొదటగా జీవులను అనేక జన్మలలో ప్రవేశపెట్టి ఉచ్చారణ చేయబడని మాటలను తెలియచేస్తున్నాడు.
వివరణ:- జీవుడు జన్మించే పరమాత్మ నిర్దేశించిన జన్మయందు మాత్రమే. అది కూడ ఆ జీవుడు చేసుకొన్న పుణ్య- పాపకర్మఫలాల కనుగుణంగా మాత్రమే. ఈ విషయాన్ని ఈ మంత్రం నాలుగు వాక్యాలలో వివరిస్తూ ఉంది.
ఆ యో ధర్మాణి ప్రథమః ససాద:- సృష్టి రచనకు పూర్వమే భగవానుడు సృజింప యోగ్యమైన జీవుల కర్మలను- కర్తవ్యాలను- ధర్మాలను విచారణ చేసాడు అని ఈ వాక్యానికర్థం. అంటే ఏ ఏ జీవులు ఏఏ కర్మలను చేసారు మరియు వారికి అనుభవ యోగ్యమైన ఫలాలు, వాని ననుభవింప సాధకమైన సాధనాలు ఎలా ఉండాలి? అన్న విషయాన్ని భగవంతుడు ముందే నిర్ణయించి యుంచాడని భావం. వేదాంతులు భగవంతుని ఈ శక్తినే ఈక్షణశక్తిగా చెబుతాడు. ఋగ్వేదంలోని ‘ఋతం చ సత్యం చాభీద్ధాత్తపసో- ధ్యజాయత’ (ఋ.10-190-1) ‘‘సర్వేశ్వరుని జాజ్వల్యమానమయిన తపస్సునుండి ఋతం మరియు సత్యం ప్రకాశితమయ్యాయి’’అని ఈ మంత్రంలో ఈ విషయమే నిర్ధారింపబడింది. ఋతం=సృష్టి నియమాలు మరియు ధర్మాలు. సత్యం= ఋతాన్ని అనుసరించి యుండే కర్మఫలాలు మరియు వ్యవస్థలు. అథర్వవేద మీ ఋతం- సత్యాలనే ధర్మమని ఒక్క మాటగా పేర్కొంది.
తతో వపూంషి కృణుషే పురూణి:- తదుపరి జీవుల కర్మఫలాల నాలోచన చేసి అనేక శరీరాలను దైవం సృష్టిస్తుంది’’అంటే జీవులకే యే కర్మలున్నాయో వాని కనుగుణంగా అనుభవయోగ్యమైన శరీరాలను, భోగాలను, భోగసామగ్రిని పరమాత్మకే సిద్ధపరుస్తుందని అర్థం.
ధాస్యుర్యోనిం ప్రథమ ఆవివేశ:- ‘‘కర్మఫలాలను స్వీకరించి జీవుడు తదనుగుణమైన శరీరంలోనికి ప్రవేశిస్తాడు’’అంటే జీవుడు తల్లి గర్భంలోనికి ముందుగానే ప్రవేశిస్తాడు. ఆ తరువాతనే ఆ జీవుడికి యోగ్యమైన శరీరం తల్లిగర్భంలో నిర్మాణమవుతుంది. అలా ప్రవేశించకుంటే తల్లికి గర్భమే స్థిరపడదు.
యో వాచమనుదితాం చికేత:- ఈ వాక్యంలో రెండర్థాలున్నాయి. మొదటిది దైవపరమైనది. రెండవది జీవునిపరమైనది. దైవపరంగా ‘‘ఉచ్ఛారణ చేయబడని శబ్దాలనుకూడ తెలుసుకొంటాడు’’అని అర్థం. అంటే మనం మన మనస్సులోని ఆలోచనలను మాటల ద్వారా వ్యక్తంచేయకముందే దైవం తెలుసుకొంటుంది లేదా నోటితో మాట పలుకబడుటకుముందే దానిని గ్రహించగలడు అనగా ఆ విధంగా గ్రహించి పలుకవలసియున్న మాటలను పలికే యుక్తిని అనుగ్రహించగలడని అర్థం. ఆ విధంగా ఆ దైవమే మెలమెల్లగా ప్రకటితమయ్యే ధ్వనులనుండి మాటల స్పష్టత కల్పించగలడని భావం
ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512