స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే పాప మంధకారంలో జరిగినంత మాత్రం అది రహస్యంగా ఉండిపోదు సరికదా ‘తద్ ద్యామేతి మహద్ వ్యచః’ ఆ పాపం బాగా విస్తరించి ఆకాశం వరకు వ్యాపిస్తుంది’’ అంటే పాపకర్మ బాగా బహిర్గతమై అంతట వ్యాపిస్తుందని భావం. అయితే పాపం దూరం వరకు వ్యాపించిపోయింది కదా అని పాపం చేసినవాడు ఆ పాప తీవ్రత నుండి రక్షింపబడడు. ‘తద్వైతతో విధూపాయత్ ప్రత్యక్ కర్తారమృచ్ఛతు’ ‘‘ఆ పాపం తిరిగి పాపి వద్దకే మరింత తీవ్రతరంగా వచ్చి చేరుతుంది.’’
అథర్వణవేద మీ పాపఫలాన్ని గురించి మరింత కఠినంగా ఇలా వివరించింది.
న కల్బిషమత్ర నాధారో అస్తి న
యన్మిత్రైః సహ సమమమాన ఏతి
అనూనం పాత్రం నిహితం న
ఏతత్ పక్తారం పక్వః పునరా విశాతి॥ అథ.వే.12-3-48॥
‘‘కర్మఫలానుభవానికి ఎన్నడూ తగ్గింపుగాని హెచ్చింపు గాని ఉండదు. దానికి ఎటువంటి ఆశ్రయం దొరకదు. మత్రులతో కలిసి వెళ్లినా పాపఫలం పంచుకోబడదు. కర్మఫల పాత్ర తరగదు. పెరగదు. వండుకొన్న పాపం వండుకొన్నంత పాత్రలో (జన్మలో) సిద్ధమై యుంటుంది.’’
మరి ఆ పాపానికి నిష్కృతియే లేదా? సంపూర్ణంగా పాప ఫలాన్ని అనుభవించ-వలసిందేనా? అని మనసా వాచా కర్మణా పశ్చాత్తప్తుడైన వానికి పాపఫల విముక్తి కుపాయముంది. అదే భగవత్ ప్రార్థన అని అథర్వణవేద మీ ప్రార్థనా మంత్రరూపంగా తరుణోపాయాన్ని సూచిస్తూంది.
యస్యేదం ప్రదిశి యద్విరోచతే
యజ్ఞాతం జనితవ్యం చ కేవలమ్‌
స్తౌమ్యగ్నిం నాథితో జోహవీమి స
నో ముంచత్వంహసః॥ అథ.వే.4-23-7॥
‘‘ఈ అఖండ బ్రహ్మాండ సృష్టిజాలాన్ని స్వాజ్ఞాబద్ధంగా నడుపుతూ సర్వేస్వత్ర ఆనందమయుడై విరాజిల్లు ఆ భగవానుని సంతప్త హృదయంతో పశ్చాత్తప్తుడనై నా పాపభావాలనుండి విముక్తి కలిగింపుమని బిగ్గరగా మొరపెట్టుకొంటున్నాను.’’
ఇలా పాప భావాల నుండి విముక్తి కలిగించమని ప్రార్థించేవాడికి పాపమెలా సంక్రమిస్తుంది? ప్రార్థన అంట ఇదేనని, పాపాలను పోగొట్టుమని మాత్రం కాదని వేదం ఈ మంత్రం ద్వారా సూచించింది. ఈ ప్రార్థనా రీతి పాపప్రక్షాళనను మనస్ఫూర్తిగా కోరే పశ్చాత్తప్తుడికి అమృతోపదేశమే. **
- ఇంకాఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512