స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సుదీర్ఘమైన యాచకుని జీవితమార్గాన్ని గ్రహించి ధనవంతుడాతనిని ప్రసన్నుడిగా చేయాలి’’అంటే దానం తాత్కాలిక ప్రయోజన పరిమితంగా గాక జీవితంలో ఎన్నడు యాచకుడు కానట్లుగా దానం చేయాలని భావం. ఇట్టి దానం సాధ్యమా అని ధనవంతుడు చింతింపవలసిన పనిలేదంటూంది వేదం. ఎందుకంటే-
‘ఇంద్రో యజ్వనే గృణతే చ శిక్షత ఉపేద్ దదాతి’ ‘‘యాజ్ఞికులకి ఉపదేశకులకు మరియు ధర్మ శిక్షకులకు భగవంతుడు అత్యంత సన్నిహితంగా ఉండి ధనాన్ని ఇస్తూనే ఉంటాడు’’అని దైవపక్షాన వేదం అభయమిచ్చింది.
లోకోపకారంకోసం జీవితాన్ని అంకితం చేసినవాడికి, ధర్మోపదేశాలతో జనులను సన్మార్గంలో నడిపించేవాడికి, ప్రజలకు క్రమశిక్షణ నేర్పేవాడికి ధనాన్ని సర్వేశ్వరుడే ఈయకుంటె ఎవరిస్తారు? ఆయన ఇచ్చేటప్పుడు ‘న స్వం ముషాయతి’ ‘‘తన కోసమేమీ దాచుకోడు’’అని వేదం దైవదాన ప్రవీణతను తెలిపింది. జీవులకు ప్రబోధం, శిక్షణ, స్వయం యజ్ఞనిర్వహణ సదా పరమాత్మచేసే కార్యాలే. ఆయనను అనుకరిస్తూ ఆ మూడు కార్యాలను నిర్వహించేవారి ఎడల దేనిని దాచిపెట్టడు. కరుణాళువై సంప్రీతితో వారి ధనాన్ని ‘్భయో భూయో రయిమిదస్య వర్ధయన్’ ‘‘మాటిమాటికి అట్టివారి ధనాన్ని ఇతోధికంగా సమృద్ధం చేస్తాడు’’ మరియు ‘అభినే్న ఖిల్యే ని దధాతి దేవయుమ్’అట్టి దాసశీలురను అఖండమైన ధనసమృద్ధ స్థితిలో ఉంచుతాడు. భగవానుని దయాదృష్టి వలన వారి ధనమెలా వృద్ధి చెందుతుందో అథర్వణవేదమీ విధంగా వివరిస్తూ ఉంది.
న తా నశంతి న దభాతి తస్కరో
నాసామామిత్రో వ్యథిరాదధర్షతి
దేవాంశ్చ యాభిర్యజతే దదాతి చ
జ్యోగిత్త్భాః సచతే గోపతిః సహ॥॥
‘‘గోసంపద కలవాడు ఏ పదార్థాలతో దేవయజ్ఞం చేస్తాడో, ఏ పదార్థాలను దానం చేస్తాడో ఆ పదార్థాలనే అతడు సమృద్ధిగా కలిగియుంటాడు. ఎందుకంటే ఆ పదార్థాలెన్నడూ అతడికి నష్టం కావు. వాటిని దొంగలు దొంగిలించరు. దుఃఖాన్ని కలిగించే శత్రువులాతడిని బాధించలేరు’’ సత్యం చెప్పాలంటే ఇతరులకు తృప్తిని కలిగించే ధనమే సార్థకమైన ధనం. దానం మరియు యజ్ఞ కార్యనిర్వహణ ద్వారా మాత్రమే ధనమందరికి ప్రీతిపాత్రమవుతుంది. తద్భిన్నమయిన ధనం నిందనీయమే అవుతుంది. ధనమెట్టిదయినా అది మన సంకల్పంలోనే ఉంది. మరి మీరేమి సంకల్పిస్తారో ఇక!!
**
పాపం తిరిగి తిరిగి పాపినే చేరుతుంది
అసద్ భూమ్యాః సమ భవత్ తద్ ద్యామేతి మహద్ వ్యచః
తద్వై తతో విధూపాయత్ ప్రత్యక్ కర్తారమృచ్ఛతు॥అథ.వే.4-19-6॥
భావం:- పాపం భూమినుండి, అంధకారం నుండి జనిస్తుంది. అది అంతట వ్యాపిస్తూ నింగి దాకా ప్రాకుతుంది. ఆ పాపం ఆ నింగిలో బాగా పండి తిరిగి పాపం చేసిన వాని వద్దకే వచ్చి చేరుతుంది.
వివరణ:- భూమి దివ్య లోకాలవలె సంపూర్ణ జ్ఞానమనే ప్రకాశం చేత ప్రకాశమానం కాదు. అజ్ఞానమనే అంధకారం చేత ఆవరింపబడియుండేది. అందుకే పాపం అజ్ఞానమనే అంధకారం వ్యాపించిన భూలోకంలో జరుగుతుంది. మనిషి పాపం చేసేందుకు సాధారణంగా రహస్య ప్రదేశాన్ని ఎంచుకొంటాడు. మానవుని ఈ మనఃస్వభావాన్ని ఆలంకారిక భాషలో వేదం ‘అసద్ భూమ్యాః సమభవత్’ ‘‘పాపం అంధకారమున్న భూమిలోనే జనిస్తుంది’’ అని వర్ణించింది.

ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512