స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిష్కాములయిన జ్ఞానులు ధర్మరూపమైన యజ్ఞానికి అంగమైన వ్రతసహితమైన తపస్సుచేత కీర్తివంతుడై మరణానంతరం సత్కర్ములు పొందే మోక్ష కేంద్రమైన ఆనందమయ ప్రకాశమయ లోకాన్ని పొందుతున్నారు. అదే విధంగా మేమును అట్టి లోకాన్ని పొందుతాము.
మోక్షవర్ణన సందర్భంలో ప్రకాశమూ మరియు ఆనందాల చర్చ తప్పక వస్తుంది. ఈ రెండింటిని ఋగ్వేదమిలా వివరిస్తూంది.
‘‘మూడు దుఃఖాలనుండి (ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతిక) విముక్తమై, మూడు ప్రకాశాలతో (పారమాత్మిక, ఆత్మిక, ధార్మిక) కూడిన ఏ అవస్థలో ఆత్మ స్వేచ్ఛగా సంచరిస్తుందో అదే మోక్షం. ఓ ఆనంద ప్రదాయక! కర్మఫలముత్తేజమై అత్యధికంగా అనుభవప్రదాయకమై నిలిచే దశనుండి నన్ను విముక్తుణ్ణిచేయి. ముక్తి కోరే నాపై దయ చూపు.’’
మృత్యువు ద్వారాకాక కేవలం జన్మ చేతనే జీవుడు పొందే ముక్తదశ లేదా ముక్తిదశకే ‘అమృత దశ’అని పేరు. వేదంలో ముక్తి దశకే ‘స్వః’ అన్న నామం పలుమార్లు వ్యవహరించబడింది. దీని యర్థం ‘ఆనందం’, దాని నిర్వచనం సు+అస్= స్వస్= స్వః= ఉత్తమ అవస్థ అని. మోక్షంకంటే మించిన ఉత్తమ అవస్థ మరొక్కటి ఏముంది?ఈ దశలో జీవుడు ప్రకృతి సంబంధాన్ని పూర్తిగా విడిచి పరమాత్మతో సదా సంపూర్ణ సంసర్గాన్ని పొందుతాడు. ప్రకృతి సంసర్గం వీడి పరమాత్మ సంసర్గంతో పరమానంద చరమసీమను జీవుడు పొందుతాడు. ఇదెలా సాధ్యం?
అంటే ఈ వేదమంత్రం ‘తేనే గేష్మ సుకృతస్య లోకం ఘర్మస్య వ్రతేన తపసా యశస్యవః’ ‘‘్ధర్మ సంబంధమైన తపస్సు మరియు వ్రతాచరణల ద్వారా యశోవంతులమై సుకృత జీవులుపొందే లోకం= మోక్ష పదాన్ని మేము పొందెదముగాక’’ అన్న ఆత్మప్రబోధ వచనం ద్వారా వత్రసహితమైన తపశ్చరణను ఉపాయంగా చెప్పింది. అయితే వేదం ‘ఘర్మస్య తపసా వ్రతేన’ అని చెప్పడంలో ఒక మార్మికతను నిబద్ధం చేసింది.
ధర్మ శబ్దానికర్థాన్ని అథర్వణవేదం ఇలా నిర్వచించింది. ‘ఇంద్రో జాతో మనుష్యేష్వంతర్ధర్మస్తప్తశ్చరతి శోశుచానః’ (అథ.4-11-3) ‘‘మనుష్యులలో జన్మించి అత్యంత తేజోవంతుడై తపస్సునుచేస్తూ సంచరించే ఇంద్రః= జీవుని ధర్మము’’అంటే మనుష్యులలో జ్ఞాన-వైరాగ్యాలు కలిగి తపోనిష్ఠ చేత విరాజమానుడయ్యే జీవుని కర్మయే ధర్మమని భావం. తపస్సు కేవలం ఆడంబరంకోసం కూడ చేయవచ్చు. కాని ఆ తపస్సు యమ= నియమాలైన సత్య- అస్తేయ (దొంగతనం చేయకుండుట). బ్రహ్మచర్యాది వ్రతాలతో నిష్ఠగా చేయబడే తపస్సుమాత్రం దంభం (ఆడంబరం) కాదు.
యోగదర్శనంలో ఈ యమ- నియమాదులు మహావ్రతాలుగా చెప్పబడ్డాయి. ఈ మహావ్రతాలతో చేయబడిన తపస్సును గురించి యోగదర్శనంలో పతంజలి ‘కాయేంద్రియ సిద్ధిరశుద్ధిక్షయాత్తపసః’ (యో.ద.2-43)లో తపస్సుచేత శరీర- ఇంద్రియగత మాలిన్యాలు తొలగి పరిశుద్ధమై శరీర-ఇంద్రియ కర్మ సంసిద్ధి సిద్ధిస్తుంది’’అని వివరించాడు. వేదవ్యాసుడు కూడా ఈ విషయానే్న ఇలా ధ్రువపరిచాడు.
**
దాతకే భగవంతుడు అన్నీ ఇస్తాడు ఇంద్రో యజ్వనే గృణతే చ శిక్షత ఉపేద్దదాతి న స్వం ముషాయతి
భూయోభూయో రయిమిదస్య వర్ధయన్నభినే్న ఖిల్యే ని దధాతి దేవయుమ్‌॥ ॥
భావం:- యజ్ఞాలను చేసేవారికి మరియు ప్రజలకు ప్రబోధంచేస్తూ ధర్మాచరణ యందు శిక్షణ యిచ్చేవారికి మిక్కిలి దగ్గరగా ఉంటూ భగవానుడు ధనాన్ని ఇస్తూనే ఉంటాడు. కాని దాచుకోడు. మాటిమాటికి వారి ధనాన్ని అభివృద్ధిపరుస్తూ వారిని అఖండమైన ఉన్నతిస్థితిలో ఎల్లప్పుడు భగవంతుడు ఉంచుతాడు.
వివరణ:- దానం వైదిక ధర్మంలో సర్వోత్కృష్టమైన ధర్మం. ఆ ధర్మాన్ని సదా ఆచరించమని మానవ సమాజానికి ప్రేరణ కలిగిస్తూ ఋగ్వేదం ప్రబోధించింది.
ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512