స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ముప్పదిమూడు మంది దేవతలు అంటే ఎవరు? ఎనిమిది మంది వసువులు, పదకొండు మంది రుద్రులు, పనె్నండుమంది సూర్యులు, ఇద్దరు అశ్వనీ దేవతలు. వీరే ముప్పదిమూడు మంది దేవతలు. వీరంతా మన శరీరావయవాలలో నిలిచి ఉంటారు. ఇందరు దేవతలు వివిధ శరీరాంగాలలో నిలిచియుండగా మానవుడు తాను బలహీనుడుగా భావించి వారి బలాన్ని తనయందు నింపుమని దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
చిత్రమేమంటే అడిగేది బలం. మరి భగవంతుణ్ణి ‘బలవంతుడా, శక్తిమంతుడా’అని సంబోధించక ఈ మంత్రంలో ‘వాచస్పతి’అని ఎందుకు సంబోధించినట్లు? ఈ శబ్దప్రయోగమే వేద శబ్దాల గంభీరార్థకతను స్పష్టంచేస్తుంది. వాచః= శబ్దాల అనగా తదధిష్ఠాన దేవత ఐన సరస్వతికి పతిః= భర్త- బ్రహ్మ- అంటే జ్ఞాన ప్రబోధకుడని భావం. అంటే పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుడు శక్తిని ఏదో పదార్థాన్ని ఖాళీ పాత్రలో నింపినట్లుగాక శక్తిని స్వయంగా నింపుకునే యుక్తిని ప్రబోధించేవాడుగా ఉంటాడని భావం. ఆ యుక్తి ఎటువంటిదో అథర్వణవేదం ఇలా వివరించింది.
‘వయం త్వేంధానాస్తన్వం పుషేమ’ (అథ.5-3-1) ‘‘మేము శరీరాన్ని ప్రజ్వలింపజేసి శరీరాన్ని పుష్టిమంతంగా చేసుకొంటాం’’. అగ్ని= చైతన్యానికి సంకేతం. అనగా చైతన్యవంతులమై శరీర పుష్టిని పొందుతామని భావం. మానవుడికి సమస్త ప్రకృతిశక్తులు తనలో చైతన్యాన్ని ప్రజ్వలింప చేసినప్పుడే సిద్ధిస్తాయని వేదోపదేశం.
ధర్మం మోక్షసాధనం
యేన దేవాః స్వరారురుహుర్హిత్వా శరీరమమృతస్య నాభిమ్‌
తేన గేష్మ సుకృతస్య లోకం ఘర్మస్య వ్రతేన తపసా యశస్యవః॥ ॥ 4-11-6॥
ఇంకా ఉంది

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512