స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ప్రభూ!

నీవు నా హృదయాసీనుడవు కమ్ము.
అగ్న ఆ యాహి వీతయే గృణానో హవ్యదాతయే
ని హోతా సత్సి బర్హిషి॥
సామవేదం 1-1-1॥
భావం:- ఓ అగ్నీ! జ్ఞానోపదేశం చేస్తూ, మేమనుభవించే భోగాల పవిత్రతను ప్రబోధిస్తూ అన్నివైపులనుండి రమ్ము. మహాదాతవై మా హృదయాసనాలపై ఎల్లప్పుడు కూర్చో.
వివరణ:- ఇది సామవేదంలోని మొదటి మంత్రం. సామవేదం ప్రధానంగా ఉపాసనా విధులను బోధించే వేదం. ఉపాసనాపరంగా సాధకుడు ఎన్ని విధాలుగా తన విధులను నిర్వహించాలో వానిని సామవేదం విపులంగా వర్ణిస్తుంది. భగవదుపాసన ఆరంభంలో స్తుతి మరియు ప్రార్థనా రూపంగా సాగుతుంది. అందుకే సామవేదం-
అగ్న ఆ యాహి వీతయే గృణానో హవ్యదాతయే ‘‘సర్వులను సర్వాభ్యుదయ పథాన నడిపించే అగ్నిదేవా! జ్ఞానోపదేశకుడవై భోగాల శోధనను తెలుపుతూ రమ్ము’’అనే మంత్రంతో ఆరంభమవుతుంది. భగవంతుడు మానవుడికి సమస్తజ్ఞానంతోబాటుగా భోగోపకరణాలను కూడ ప్రదానంచేస్తాడు. కాని భోగాలను అనుభవించాలా? లేక తిరస్కరించాలా? అన్నది మనిషి విచక్షణ మీద ఆధారపడియుంది. భోగాలను అనుభవించరాదని దైవముపదేశం చేయదు. కాని అజ్ఞానవశం చేత మానవుడు భోగాలను సంపాదించుకొనే ప్రయత్నంలోనే తప్పులను చేస్తాడు. ఆ తప్పులనుండి సంరక్షించేందుకే పరమేశ్వరుడు మానవులకు వేదజ్ఞానాన్ని అనుగ్రహించాడు. సర్వేశ్వరుడు దయాసింధువు. కాబట్టి తప్పులను చేసే సమయంలో హృదయంలో ఉండి చేయవలదని ఎప్పటికప్పుడు ప్రబోధిస్తూనే ఉంటాడు. కాని మానవులమైన మనం ఆ దైవోపదేశాన్ని వినం. విన్నా విననట్టుగానే నటిస్తాం. అదే మనమంతా చేసే పెద్ద అపరాధం. ఇది సామాన్యుల స్థితి.
మరి దైవోపాసకులో! తమ దోషాలనెరిగినవారు. ఎరిగి పశ్చాత్తాప పడినవారు పశ్చాత్తాప పడి హృదయంలోగల దైవోపదేశాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు. ఐహికభోగాల ఎడల విరక్తులై దైవ సన్నిధికి చేరుకోవాలని ఆరాటపడేవారు. అందుకే వారు భగవదుపాసక స్థితికి చేరినవారు. అట్టి ఉపాసకుని ప్రార్థనయే ఈ సామవేదారంభంలోని ఈ ప్రథమ మంత్రం ‘ఆయాహి’ ‘‘అన్నివైపుల నుండి రా’’. ఈ మాటలోనే సాధకుని హృదయంలో దైవసాన్నిధ్యంకోసం పడే ఆరాటమెంత తీవ్రదశకు చేరిందో స్పష్టపడుతూంది.
దైవం హృదయంలో సదా నివసించియుండేవాడు కదా! ‘ఆ యాహి’అన్న ప్రార్థన ప్రయోజనమేమిటి? నిజమే. దైవం సదా మన హృదయస్థమై ఉంది. కాని జీవుడికి సహజమైన అజ్ఞానం ఆవరణగా కప్పియున్నందువలన దైవాన్ని చూడలేకున్నాం. ఆ స్థితిలోనుండి పుట్టిన ప్రార్థనయే ఇది. ‘ఆ యాహి వీతయే’ ‘‘జ్ఞాన ప్రకాశాన్ని ప్రకాశింపచేస్తూ రమ్ము’’అని. వచ్చి ‘‘ని హోతా సత్సి బర్హిషి’ ‘‘మహాదాతవై మా హృదయంలో ఆసీనుడవుకమ్ము’’. ఆసీనుడవయినావని మాకు తెలిసినంతనే అంతర్యామివైన నీ ఎదుట పాపాచరణను మేము చేయగలమా?
ఉపాసన అంటే ఇదే. ఉపాసనా శబ్దానికి సామాన్యార్థం ఉప= దగ్గరగా ఆసన= కూర్చుండుట. అంటే దైవానికి మనందగ్గరగా కూర్చుండు అని భావం. అంతమాత్రమేనా? కాదు. దైవం మన హృదయంలో స్థిరంగా ఉన్నాడని ఎరుక కలిగియుండాలి. హృదయంలో మనస్సుచేసే సంకల్ప- వికల్పాలెనె్నన్నో భ్రమిస్తూ ఉంటాయి.