స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే ఋగ్వేదం ‘అసి హోతా న ఈడ్యః’ (ఋ.1-12-3) మహాప్రదాతవైన నీవు ఈడ్యః= పూజ్యుడవుఅని నిర్ధారించింది. ఆ మాటనే ప్రస్తుత మంత్రం ‘అగ్నిమీళే’ ‘‘నేను అగ్నిని పూజిస్తున్నాను’’అని వేదారంభంలోనే ప్రతిపాదించింది. ఈ మంత్రానికి తదుపరి మంత్రంలో ‘అగ్నిః పూర్వేభిఋషిభిరీడ్యో నూతనైరుత’ (ఋ.1-1-2) ‘‘్భగవానుడు ఆద్యపురాతన ఋషులకు వారి శిష్య- ప్రశిష్యులకు పూజనీయుడు’’అని పునఃపునః శాసించింది. అంటే సర్వజనులు భగవంతుని పూజించాలని వేదం వేరే చెప్పాలా?
**
దైవం నిన్ను మంచి పనులకే పుట్టించాడు.
ఇషే త్వోర్జే త్వా వాయవ స్థ దేవో వః సవితా ప్రార్పయతు
శ్రేష్ఠతమాయ కర్మణ-
ఆప్యాయధ్వమఘ్న్యా- ఇంద్రాయ
భాగం ప్రజావతీరనమీవా-
ఆయక్ష్మా మా వ స్తేన- ఈశత
మాఘశంసో ధ్రువా- అస్మిన్ గోపతౌ స్యాత బహ్వీ
ర్యజమానస్య పశూన్ పాహి॥ శు.య.1-1॥
భావం:- భగవంతుడు ఇష్టప్రాప్తికొఱకు మరియు బలప్రాప్తికొఱకు నిన్ను ప్రేరేపించుగాక! మీరు బలవంతులుగా ఉందురుగాక. ఉత్తమమైన కర్మలనాచరించుటకే పరమేశ్వరుడు మిమ్ము సంసిద్ధులనుచేయుగాక! హింసాప్రవృత్తిని వీడినవాడవై ఐశ్వర్య ప్రయోజనాన్ని పొందెదవుగాక! మీరంతా సంతానవంతులై, రోగస్పర్శ లేనివారై, క్షయాది దీర్ఘరోగాదులకు దూరంగా ఉండెదరుగాక! మీపై దొంగ శాసకుడు కాకుండుగాక!
పాపాలోచనలు లేని శాసకుని అధీనంలో నిశ్చరమైన- హింసారహితమైన సుస్థితిని పొందెదరుగాక!

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512