స్వాధ్యాయ సందోహం
స్వాధ్యాయ సందోహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దేవా! మేము దానికర్హులం కాకుంటే ‘కతమః స హోతా’ ‘‘అలా నిన్ను తన వానిగా చేసుకొన్న పుణ్యపురుషుడెవరు? అని వేదం జిజ్ఞాసువుల సోత్కంఠను ప్రకటించింది.
ఉత్కంఠ భరితమైన ఈవేదమంత్ర ప్రశ్నలు కేవలం శుష్కమైనవి కావు. పరమాత్ముని దర్శన సౌధాన్ని అధిరోహింపచేసే సోపాన క్రమాలు. ముందు వీని నిరోహణం చేసిన వారెందరో! వా రిలా అధిరోహించి భగవద్దర్శన సౌభాగ్యాన్ని అందుకోమనియే ఈ వేదమంత్ర ప్రశ్న సోపానక్రమోపదేశం.
దేవా! తమకు తెలిసినంతగా వేదజ్ఞులు పూజిస్తారు
తం పృచ్ఛంతో- వరాసః పరాణి ప్రత్నా త ఇంద్ర శ్రుత్యాను యేముః
అర్చామసి వీర బ్రహ్మవాహో యాదేవ విద్మ తాత్త్వా మహాంతమ్॥ ॥
భావం:- ఓ పరమేశ్వరా! జిజ్ఞాసాపూర్వకంగా ప్రశ్నించి నీ గురించి తెలుసుకొనే జిజ్ఞాసువులమైన మేము నీకు తరువాతి వారమే. అట్టి మేము నీ ప్రాచీనతమైన ఉత్తమమైన నీ కర్మలను వేదానుగుణంగా ఆచరిస్తున్నాము. సర్వవేదాధ్యాయనం చేసిన మేము నీ గురించి మేమెంత తెలుసుకొంటున్నామో అంతగా మహామహిమగల నిన్ను పూజిస్తాము.
వివరణ:- భగవానుడు సనాతనుడు. ఆయన సృష్టికూడ సనాతనమే. భగవాననివలె జీవుడు కూడ సనాతనుడే. కాని శరీరధారణ వలన, గుణకర్మ విశేషాలవలన జీవుడు భగవానుడికంటే అవరుడు (తక్కువవాడు). జీవుని దృష్ట్యా నిరంతరాయంగా వస్తున్న సృష్టి నియమాలు బహుప్రాచీనతమైనవి. ఇవన్ని భగవానునిగూర్చి తీవ్ర జిజ్ఞాసను రేపుతాయి. జిజ్ఞాస కలిగినంతనే ప్రథమంగా జనించేది భగవానుని ఆదేశాలేమిటన్నదే. వేదాలు వానిని ప్రధానంగా ప్రబోధిస్తాయి. భగవదభిలాషియైన జిజ్ఞాసువు వానిననుసరించి తన జీవనాన్ని తన్నుతాను నియంత్రించుకొంటాడు. దానిద్వారా ఆతడి భగవద్విజ్ఞానం సమృద్ధవౌతుంది. జ్ఞాన సమృద్ధుడైన అతడు స్వయంగా ‘బ్రహ్మ వాహ’= బ్రహ్మస్వరూపుడే లేదా వేదస్వరూపుడే అవుతాడు. మరియు ‘బ్రహ్మవాహో యాదేవ విద్మ’ బ్రహ్మవాహి ‘‘తానెంత తెలుసుకొంటాడో’’ ‘అర్చామసి తాత్ త్వ మహాంతమ్’ ‘‘మహామహిమగల నిన్ను అంతగానే అర్చిస్తాడు.’’
వేదాధ్యయనం మరియు వేద విచారణ ఎంత విస్తారంగా చేస్తాడో అతడు
నహి ను తే మహిమనః స్వాదే సమస్య న మఘవన్మఘవత్ త్వస్య విద్మ (ఋ.6-27-3)
- ఇంకాఉంది