స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

2. ఓజీయాన్:- రాజు సద్గుణ సంపద చేత ఆదర్శనీయుడైయుండేవాడు కావాలి. అలాకాకుంటే రాజుకుగల దుర్గుణాలు ప్రజలను ఆదర్శవంతమై ‘యథారాజా తథాప్రజాః’అన్న చందంగా ప్రజలు కూడ దుర్జనులే అవుతారు.
3. తవ సస్తవీయాన్:- బలవంతులైన రాజులలో బలవంతుడైన రాజుగా ప్రసిద్ధుడు కావాలి. కాకుంటే దేశ స్వాతంత్య్రానికే భంగమేర్పడి పరరాజుల దురాక్రమణలు జరుగుతాయి.
4. వృద్ధమహాః:- దేశంలోగల జ్ఞానులను సన్మానించువాడు కావాలి. తద్వారా రాజప్రోత్సాహంతో దేశంలో విజ్ఞానాభివృద్ధి సమృద్ధమవుతుంది.
5. కృతబ్రహ్మా:- రాజ్యంలో ప్రజావసరాలకు సరిపడు అన్నాన్ని, ధన సమృద్ధిని, జ్ఞాన సమృద్ధిని అభివృద్ధిచేయాలి. ఆంతరంగిక శాంతి భద్రతలకు అవి ఎంతగానో దోహదపడతాయి.
6. విశ్వాసాం పురాం దర్త్ను మావత్:- బహిశ్శత్రువుల నుండి దేశాన్ని సంరక్షించేందుకు సమర్థవంతమైన అపార సేనను సమీకరణ చేయాలి. దానివలన పరరాజులు స్వదేశం మీద దురాక్రమణ చేసేందుకు సాహసింపరు. రాజు ఆ విధంగా అపార సేనాధిపత్యం వహించి యుండాలని ఋగ్వేదం-
రాజా రాష్ట్రానాం పేశో నదీ నామనుత్తమస్మై క్షత్రం విశ్వాయు (ఋ.7-34-11)
‘‘రాజు దేశాలకు (దేశవాసులకు) నదులకు (గర్జించే సేనలకు) ప్రతినిధియై యుండాలి’’అని ఆదేశించింది. ఋగ్వేదాన్ని అనుసరించి అథర్వణ వేదంకూడా స్థూలంగా రాజు లక్షణాలను వర్ణించింది. రాజు సమస్త దేశానికి ప్రతినిధి. అందుచేత అతడు ఆ దేశ ప్రజలకు ప్రతిస్వరూపుడు. కాబట్టి రాజు సర్వశ్రేష్ఠుడు కావాలి. ‘వర్ష్మ క్షత్రాణామయమస్తు రాజా’ (అథ.వే.4-22-2) అని నిర్దేశించింది. ఆ శ్రేష్ఠతను వివరిస్తూ అథర్వణ వేదం (అథ.4-22-3) ‘అయమస్తు ధనపతిర్థనానామయం విశాం విశ్చతిరస్తు రాజా’ ‘‘రాజు ధనవంతులలో ధనవంతుడై ప్రజలకు ప్రభువు కావాలి’’అని వివరించింది. ఈ విధంగా రాజు లక్షణాలు వేదాలలో ఎనె్నన్నో కానవస్తాయి. అట్టి లక్షణ లక్షితులైన పాలకులకోసం మనమంతా నిరీక్షిద్దాం.
తల్లిదండ్రుల నాదరించు
త్వం వృధ ఇంద్ర పూర్వ్యో భూర్వరివస్యన్నుశనే కావ్యాయ
పరా నవవాస్త్వమనుదేయం మహే పిత్రే దదాథ స్వం నపాతమ్‌॥

భావం:- ఐశ్వర్య సంపన్నుడా! నీవు పెద్దలకు సేవచేయువాడవు మరియు పూర్వీకులకు హితాన్ని కోరువాడవు కమ్ము. ఏరికోరి సేవింపదగిన జ్ఞానులను, తండ్రిని నూతన వస్త్రాలతో ఆదరించుము. వారికి కావలసిన గృహ సౌకర్యాలను, భోజనాదులను మరియు వస్తు ద్రవ్యాలను సమృద్ధిగా సమకూర్చుము.
వివరణ:- మనిషి ఐశ్వర్యం రాగానే ప్రమత్తుడైపోతాడు. చివరకు మనిషిగా తన కర్తవ్యాలను కూడ విస్మరిస్తాడు. ధనమదంతో తల్లిదండ్రులను, పెద్దలను, జ్ఞానులను సహితం లెక్క చేయడు. సమాజంలోని ఈ వర్తమాన- భవిష్యత్ దుఃస్థితిని గ్రహించి వేద మీ మంత్రంలో మాతాపితలకు, పెద్దలకు సేవ చేయుమని ఆదేశిస్తూంది.
పెద్దలు- వృద్ధులు తమ జీవితంలో ఎన్నో జీవితాలనుభవాలను చవిచూచి ఉంటారు. జీవితారంభ దశలో ఉన్న యువకుల కా అనుభవాల రుచి తెలియదు. పెద్దలు, మాతాపితలు, జ్ఞానులు తమ జీవితంలో ఎన్నో ఉత్థాన పతనాలను, కష్టసుఖాలను అనుభవించిన వారు కావడం చేత వాని నుండి ఎలా బయటపడాలో వారికుండే అనుభవం చెబుతుంది. అది యువతరానికుండదు. కాబట్టి పెద్దల అనుభవం నుండి జ్ఞానం సంపాదించుకోవడం తెలివైనవాడు చేసే పని. ఈ దృష్టితోనే పెద్దల సేవ చేయుమని వేదం గట్టిగా శాసిస్తూంది.
సాధారణంగా వన దశలో సర్వమా తనకే తెలుసునన్న అహంకార మధికంగానే ఉంటుంది. అది కేవల మహంకారమే నన్న విషయం తెలిసే సమయానికి జీవిత ప్రయాణం చాలా గడిచిపోతుంది. సమాజంలోని యువతరానికుండే ఈ బలహీనతను దృష్టియందుంచుకొనియే ఒక నీతికర్త ‘వయసా వర్ధయే ద్విద్యామ్’ ‘‘వయస్సుతోబాటు విద్యను- జ్ఞానాన్ని సంపాదించుకో’’మని హితవు చెప్పాడు.